రాష్ట్రంలో వరి ధాన్యం కొనుగోళ్ల (Paddy Procurements in Telangana)పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న వేర్వేరు వాదనలు రైతులను తీవ్ర గందరగోళానికి గురిచేస్తున్నాయి. పండిన పంటనంతా పూర్తిగా కొంటామని ఒకరు, లక్ష్యానికి మించి కొనేదిలేదని మరొకరు రైతులకు చెప్తున్నారు. ఈ ప్రకటనలకు అనుగుణంగానే భాజపా, తెరాస పార్టీలు పోటాపోటీగా ధర్నాలు, ర్యాలీలు నిర్వహిస్తున్నారు. అయితే.. క్షేత్ర స్థాయిలో రైతులు పండించిన ధాన్యం కొనుగోళ్ల (Paddy Procurements in Telangana) పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుంది. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తున్న మాటల్లో ఏది నిజమో.. ఏది అబద్ధమో తెలియక రైతులు ఆందోళనకు గురవుతున్నారు.
వడ్లు కొనట్లేదు.. వర్షాలు వచ్చేస్తున్నాయ్..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం నిందించుకోకుండా వెంటనే ధాన్యం కొనుగోలు (Paddy Procurements in Telangana) చేయాలని ఉమ్మడి కరీంనగర్ జిల్లా రైతులు డిమాండ్ చేశారు. రామడుగు మండలంలోని పలు గ్రామాల్లోని కొనుగోలు (Paddy Procurements in Telangana) కేంద్రాల్లో 20 రోజులుగా రైతులు పడిగాపులు కాస్తున్నామని తెలిపారు. వడ్లను ఆరబెట్టేందుకు స్థలం లేక, వర్షం వస్తే కుప్పలపై కప్పేందుకు టార్పాలిన్ కవర్లు అందుబాటులో లేక ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. ప్రభుత్వం వెంటనే కల్లాల్లో తడిచిన ధాన్యాన్ని కొనుగోలు (Paddy Procurements in Telangana) చేయాలని కోరుతున్నారు.
సెల్‌టవర్ ఎక్కి..
ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలంటూ రాష్ట్రంలో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పెద్ద లింగాపూర్‌లో అధికారుల తీరును నిరసిస్తూ.. అన్నదాతలు సెల్‌టవర్ ఎక్కారు. కొనుగోలు (Paddy Procurements in Telangana) కేంద్రంలో ధాన్యాన్ని విక్రయించేందుకు రోజులతరబడి పడిగాపులు కాస్తున్నట్లు వాపోయారు. అయినప్పటికీ తూకం వేయటంలో తీవ్రజాప్యం జరుగుతుందని చెప్పారు. ప్రజాప్రతినిధులు, అధికారులు వెంటనే తూకంలో వేగం పెంచాలని రైతులు డిమాండ్ చేశారు.
దిక్కుతోచని స్థితిలో..
ధాన్యం కొనుగోళ్లలో జాప్యంతో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాల్లో రైతులు అవస్థలు ఎదుర్కుంటున్నారు. రోడ్లపై కిలోమీటర్ల కొద్ది వరికుప్పలతో ధాన్యం కొనుగోలు (Paddy Procurements in Telangana) సెంటర్ల వద్ద పడిగాపులు కాస్తున్నారు. ప్రభుత్వం చేపట్టిన కొనుగోళ్లు త్వరగా జరగకపోవటం, ప్రైవేట్ వ్యాపారులు ధాన్యాన్ని కొనేందుకు ముందుకు రాకపోవటంతో అన్నదాతలకు దిక్కు తోచని పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మొలకెత్తిన ధాన్యం
ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని నిజామాబాద్ జిల్లా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలు (Paddy Procurements in Telangana) కేంద్రాల్లో సరైన మౌలిక వసతులు లేక వర్షానికి ధాన్యం మెలకలు వస్తోందని అన్నదాతలు వెల్లడించారు. తరగు, తేమ పేరిట అధికారులు కొనుగోలు (Paddy Procurements in Telangana) చేయటం లేదని ఆరోపించారు. రెండు కిలోలు తగ్గించైనా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: '358 రోజుల ఉక్కు సంకల్పం'తో అన్నదాతల విజయం!
Paddy Procurements Delay : నత్తనడకన ధాన్యం కొనుగోలు.. ఆందోళనలో అన్నదాతలు
Grain collection: అక్కడ ధాన్యం అమ్ముకోవాలంటే పలుకుబడైనా ఉండాలి.. అడిగినంతైనా ఇవ్వాలి..!
TRS Working President KTR : వరికి ఉరి బిగిస్తున్న కేంద్రం.. రైతు వ్యతిరేక విధానాలపై సమరం