ఒకప్పుడు చెరువుల్లో పట్టుకుని తిన్న చేపలు... ఇప్పుడు కోట్ల రూపాయల వ్యాపార సరుకుగా మారాయి. ఎంతోమంది చేపల చెరువులను ఏర్పాటు చేసుకొని ఉత్పత్తి చేస్తున్నారు. చాలాచోట్ల అవి రసాయనాలకు చిరునామాగా మారుతున్నాయి. దీనికి ప్రత్యామ్నాయమే రీసర్క్యులేటింగ్ ఆక్వా కల్చర్ (Recirculating aquaculture) విధానం అంటున్నారు... మహబూబ్‌నగర్ జిల్లా వాసి విశ్వనాథరాజు. బాలానగర్ మండలం గుండేడ్ శివారులోని తన పొలంలో 2015లో ఈ (Recirculating aquaculture) పద్ధతిలో చేపల పెంపకం ప్రారంభించారు. ఆఫ్రికా దేశం బెనిన్‌లో ఆర్ఏఎస్ (Recirculating aquaculture) సాగుతీరును పరిశీలించిన విశ్వనాథరాజు.... తన వ్యవసాయ క్షేత్రంలో అమలుచేస్తూ లాభాల పంట పండిస్తున్నారు.
విశ్వనాథరాజు పావు ఎకరా స్థలంలో ఒక కోటి యాభై లక్షల రూపాయల పెట్టుబడితో... ఆర్ఏఎస్ (Recirculating aquaculture) విధానంలో చేపల పెంపకం ప్రారంభించారు. డ్రం ఫిల్టర్, బయో ఫిల్టర్, వాటర్ లిఫ్టింగ్ , పంపులు, ట్యాంకులు ఏర్పాటు చేసుకున్నారు. ఈ (Recirculating aquaculture) విధానంలో గ్రావిటీ ద్వారా నీళ్లు ప్రవహించడంవల్ల విద్యుత్ ఖర్చు తగ్గుతుందని చెబుతున్నారు. చేపల నుంచి వచ్చే వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించడం వల్ల చేప పిల్లలు ఆరోగ్యంగా ఉండడంతోపాటు త్వరగా పెరుగుతాయి . ఫంగాస్ , తెలాపియా, రూప్ చంద్ , దేశిమాగు , పాబ్ దా, సింగీ వంటి చేపలు పెంచుతున్నారు. ఏటా 60 టన్నుల నుంచి 70 టన్నుల వరకు ఉత్పత్తి చేస్తున్నారు. మొత్తం ఒక కోటి 40 లక్షల టర్నోవర్... రూ.60లక్షల లాభాలు పొందుతున్నారు. ఈ విధానంలో సాగుచేయాలని ఆసక్తి ఉన్నవారికి విశ్వనాథరాజు అవగాహన కల్పిస్తూ... వారికి మార్గనిర్దేశనం చేస్తున్నారు.
చెరువుల్లో చేపలను పెంచినప్పుడు వాటి వ్యర్థాలు చెరువు అడుగు భాగంలో నిలువ ఉండిపోతాయి. తర్వాత వాటిని పలు రకాల రసాయనాలతో... శుద్ధి చేస్తారు. ఈ రసాయనాల వినియోగం లేకుండా చేపలు పెంచాలనే ఆర్ఏఎస్ విధానాన్ని పాటిస్తున్నాం. వివిధ దేశాలు తిరిగిన నాకు ఈ ఆర్ఏఎస్ పద్ధతి బాగా నచ్చింది. డ్రం ఫిల్టర్‌తో చేపల వ్యర్థాలను వేరు చేసి... శుద్ధమైన నీటిలో చేపలను ఆరోగ్యంగా పెంచుతున్నాం. ఎప్పటికప్పుడు వ్యర్థాలు తొలగించడం వల్ల చేపలు ఆరోగ్యంగా, త్వరగా పెరుగుతాయి. లాభాలు కూడా మంచిగా వస్తాయి. పాలు ఎకరంలో దీనిని ప్రారంభిస్తే.. కోటికి పైగా ఆదాయం వస్తోంది. నాకు తెలిసిన ఈ టెక్నిక్‌ను ప్రజలకు తెలిపేందుకు మీటింగ్స్ నిర్వర్తిస్తున్నాం. ప్రతి నెల 15వ తారీఖున మీటింగ్ ఏర్పాటు చేసి... ఆర్ఏఎస్ పద్ధతి గురించి తెలుపుతాం. యూట్యూబ్ ఛానల్లో కూడా దీనికి సంబంధించిన వీడియోలు అప్లోడ్ చేస్తాం.
-విశ్వనాథరాజు, చేపలపెంపకందారు
విశ్వనాథరాజు వ్యవసాయక్షేత్రాన్ని ఇప్పటికి 93 దేశాల ప్రతినిధులు పరిశీలించారు. ఆర్ఏఎస్ సాగు (Recirculating aquaculture) పద్ధతిలో ఆరోగ్యకరమైన చేపల ఉత్పత్తే గాక... లాభాలూ పొందవచ్చని చెబుతున్నారు.
ఇదీ చూడండి: 'ఆక్వారైతుకి ఆర్థిక ప్యాకేజీతోనే బాసట'
Aqua farming : ఆక్వాలో ఆక్రమణల వైరస్
ఆక్వా సాగుకు గడ్డుకాలం.. పడిపోతున్న ధరలు
Aqua Farm : లంకవానిదిబ్బలో అనుమతి లేకుండా రొయ్యల సాగు... దర్యాప్తులో వెల్లడి
రూ.లక్షకు అమ్ముడుపోయిన 'కచిడీ' చేప.. ఎందుకంత రేటు? ఏంటీ స్పెషాలిటీ?