Family Protest In Front Of Collectorate Office: 2016వ సంవత్సరంలో 2ఎకరాల 17గుంటల భూమిని కృష్ణయ్య అనే వ్యక్తి నుంచి తాము కొనుగోలు చేశామని బాధితుడు స్వామి తెలిపారు. కానీ 2017లో తమకు తెలియకుండా ఆ భూమిని మరో వ్యక్తి తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నాడని కలెక్టర్‌కు విన్నవించారు. అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న తమ భూమిని వదిలిపెట్టాలని అడిగితే కొందరు వ్యక్తులు తమపై దాడికి దిగుతున్నారని వాపోయారు.
తమ అధీనంలో ఉన్న 7ఎకరాలలో కూడా సేద్యం చేయనివ్వకుండా అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమపై తరచు దాడులకు పాల్పడుతూ.. వేధిస్తున్నారని వాపోయారు. పోలీసులకు, అధికారులకు ఫిర్యాదు చేసినా.. స్పందించకపోవడంతో చివరి ప్రయత్నంగా కలెక్టర్‌ను ఆశ్రయించి తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నామని తెలిపారు.
"నా పేరు స్వామి మాది శిఖర్గానిపల్లి. కొందరు వ్యక్తులు మా పొలంలోకి విత్తనాలు, ట్రాక్టర్లు రానివ్వడం లేదు. చంపుతామని బెదిరిస్తున్నారు. ఒక సారి కొందరు వ్యక్తులు ద్విచక్ర వాహనాల మీద కర్రలతో తరుముతూ వెంటపడ్డారు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదు. చివరి ప్రయత్నంగా కలెక్టర్ ఆఫీస్‌కు వచ్చాము. కలెక్టర్ న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు."- స్వామి, బాధితుడు
ఇవీ చదవండి: