ETV Bharat / state

ఎఫెక్ట్​: కబ్జాదారులపై చర్యలకు కలెక్టర్ ఆదేశాలు - collecter orders for land grabbers

చెరువులు, కుంటలు, కాల్వల కబ్జాలపై ఈటీవీ భారత్​ కథనాలకు మహబూబ్​నగర్​ జిల్లా కలెక్టర్ స్పందించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. చెరువు శిఖం భూముల్లో ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు లేవని స్పష్టం చేశారు.

etv bharat effect collecter orders for land grabbers
ఎఫెక్ట్​: కబ్జాదారులపై చర్యలకు కలెక్టర్ ఆదేశాలు
author img

By

Published : Feb 22, 2020, 6:12 PM IST

మహబూబ్​నగర్​లో చెరువులు, కుంటలు, కాల్వల కబ్జాలపై ఈటీవీ ప్రసారం చేసిన కథనాలపై మహబూబ్​నగర్ జిల్లా కలెక్టర్ వెంకట్రావు స్పందించారు. సంబంధిత అధికారులతో ప్రత్యేకంగా సమావేశమై... నెల రోజుల్లో ప్రత్యేక కార్యాచరణ రూపొందించి, చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నీటి వనరుల పరిరక్షణ కోసం జిల్లా, డివిజన్, మండల, గ్రామస్థాయిలో ఉన్న కమిటీలను బలోపేతం చేయనున్నట్లు అదనపు కలెక్టర్ సీతారామారావు తెలిపారు.

చెరువు శిఖంలో పట్టా భూములు ఉన్నా... ఇళ్ల నిర్మాణాలకు ఎలాంటి అనుమతి లేదని అదనపు కలెక్టర్ స్పష్టం చేశారు. పూర్తి స్థాయి నీటిమట్టం పరిధిలో ఎలాంటి నిర్మాణాలున్నా కూల్చి వేస్తామని చెప్పారు. ఇప్పటికే న్యాయస్థానంలో ఉన్న కేసుల విషయంలో మాత్రం... కోర్టు తీర్పు అనుసరించి చర్యలు ఉంటాయన్నారు.

ఎఫెక్ట్​: కబ్జాదారులపై చర్యలకు కలెక్టర్ ఆదేశాలు

ఇవీ చూడండి: పేస్టు రూపంలో బంగారం స్మగ్లింగ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.