ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కరోనా నిబంధనలతో ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలో మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోనే రెండు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. మూడ్రోజుల పాటు రెండు పూటలా జరిగే ఈ పరీక్షకు జిల్లా వ్యాప్తంగా 1494 మంది విద్యార్థులు హాజరవనున్నారు.
గురువారం ఉదయం 9 గంటలకు మొదటి సెషన్ ప్రారంభం కాగా.. ఏడు గంటల నుంచే విద్యార్థులను కేంద్రంలోనికి అనుమతించారు. పరీక్షా కేంద్రంలోకి వెళ్లే విద్యార్థులు తప్పనిసరిగా మాస్కు ధరించేలా, చేతులు శానిటైజ్ చేసుకునేలా ఏర్పాట్లు చేశారు. థర్మల్ స్క్రీనింగ్ ద్వారా పరీక్షించిన తర్వాతే లోనికి పంపించారు.