దేశ ప్రజలను అవమానించే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతున్నారని మహబూబ్నగర్ పార్లమెంట్ భాజపా అభ్యర్థి డీకే అరుణ విరుచుకుపడ్డారు. భారత్ చేసిన మెరుపుదాడులను ప్రపంచమంతా కీర్తిస్తుంటే.. సీఎం మాత్రం అనుమానించే విధంగా మాట్లాడరని ఆరోపించారు. 16 ఎంపీలతో దేశంలో చక్రం తిప్పుతామంటూ తెలంగాణ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. పాలమూరు గళాన్ని పార్లమెంట్లో బలంగా వినిపించే భాజపా అభ్యర్థిగా తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
ఇవీ చూడండి:దేశం మార్పును కోరుకుంటోంది: కవిత