ETV Bharat / state

'కొత్త వ్యవసాయ చట్టాల వల్ల రైతులకు లాభాలే.. నష్టాలు లేవు' - dk aruna about farm laws at Mahbubnagar

కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలపై విపక్షాలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నాయని భాజపా జాతీయ అధ్యక్షురాలు డీకే అరుణ ఆరోపించారు. ఈ చట్టాల వల్ల రైతులకు లాభమే చేకూరుతుందని స్పష్టం చేశారు.

dk aruna about farm laws at Mahbubnagar district
'వ్యవసాయ చట్టాల వల్ల రైతులకు లాభాలే ... నష్టాలు లేవు'
author img

By

Published : Dec 14, 2020, 7:13 PM IST

కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలతో రైతులకు లాభమే కానీ.. ఎటువంటి పరిస్థితుల్లో నష్టం కలుగదని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తెలిపారు. రాజకీయ పార్టీలు ఆ చట్టాలలో లేని అంశాలను చూపించి.. రైతులను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆరోపించారు.

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని భాజపా కార్యాలయంలో డీకే అరుణ ఆ పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. రైతులకు మేలు చేసేందుకే మోదీ ఈ చట్టాల్ని తీసుకువచ్చారని వివరించారు. మార్కెట్ యార్డులు లేకుండా పోతాయని, కనీస మద్దతు ధర ఉండదని, వ్యవసాయం కార్పొరేట్ సంస్థల చేతుల్లోకి వెళ్లిపోతాయంటూ విపక్షాలు ఆరోపణలు చేస్తున్నారని.. అవి అవాస్తవమని పేర్కొన్నారు.

మద్దతు ధరకు సన్న ధాన్యం కొనుగోలు చేస్తానని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు ఎందుకు కొనడం లేదని ప్రశ్నించారు. 70లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం లక్ష్యం కాగా.. ఇప్పటివరకు కేవలం 10లక్షల మెట్రిక్ టన్నులే ప్రభుత్వం కొన్నదని వివరించారు.

'వ్యవసాయ చట్టాల వల్ల రైతులకు లాభాలే ... నష్టాలు లేవు'

ఇదీ చూడండి: 'డీపీఆర్​లు ఎందుకివ్వరు?.. ప్రాజెక్టుల పేరుతో దోచుకుంటున్నారు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.