ETV Bharat / state

ఏమిటీ పరిస్థితి? ఏం చేస్తున్నారు?: డీహెచ్​ శ్రీనివాసరావు

author img

By

Published : May 22, 2021, 10:49 PM IST

కేసీఆర్​ ఆదేశాల మేరకు ఈరోజు వైద్య బృందం సభ్యులు ఆర్థిక కార్యదర్శి రోనాల్డ్ రోస్, వైద్య ఆరోగ్య శాఖ సంచాలకులు శ్రీనివాసరావు మహబూబ్​నగర్​ జిల్లాకు వెళ్లారు. వైద్య అధికారులు, మున్సిపల్, మండల స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో వైద్య ఆరోగ్యశాఖ పనితీరుపై వైద్య బృందం అసంతృప్తి వ్యక్తం చేసింది.

DH
DH

మహబూబ్​నగర్​ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పనితీరుపై వైద్య బృందం అసంతృప్తి వ్యక్తం చేసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్​ ఆదేశాల మేరకు ఈరోజు వైద్య బృందం సభ్యులు ఆర్థిక కార్యదర్శి రోనాల్డ్ రోస్, వైద్య ఆరోగ్య శాఖ సంచాలకులు శ్రీనివాసరావు జిల్లాకు వచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ శర్మన్​తో కలిసి జిల్లా వైద్య అధికారులు, మున్సిపల్, మండల స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

పనితీరుపై అసంతృప్తి

మండలాల వారీగా కరోనా కేసుల పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. సమావేశం వాడివేడిగా కొనసాగింది. వైద్యశాఖ అధికారుల పనితీరుపై రాష్ట్ర వైద్య సంచాలకులు శ్రీనివాసరావు అసహనం వ్యక్తం చేశారు. ఏమిటీ పరిస్థితి అని ప్రశ్నించారు. మొక్కుబడిగా విధులు నిర్వహించడం వల్లే ఇలాంటి పరిస్థితి తలెత్తిందని నిలదీశారు. పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు. జిల్లాలో దారుణమైన పరిస్థితి తాండవిస్తుంది ఏం చేస్తున్నారని డాక్టర్లను మందలించారు.

అసలేం చేస్తున్నారు…

రాష్ట్రంలోని 33 జిల్లాలతో పోలిస్తే నాగర్ కర్నూలు జిల్లాలో రోజురోజుకు కేసులు పెరుగుతున్నాయని, మీరేం చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రాథమిక స్థాయిలో ఏం జరుగుతుందో కనీసం పర్యవేక్షణ చేస్తున్నారా లేదా అని ప్రశ్నించారు. మండల స్థాయిలో కనీసం ఏం జరుగుతుందో గుర్తించలేని స్థితిలో ఉండటం దారుణమన్నారు. ఆస్పత్రుల వారీగా కేటాయించబడిన జనాభాలో ఎంతమంది పేషెంట్లు ఉన్నారు. ఏ ఇంటిలో ఎవరికీ జ్వరం ఉంది. తెలియకపోవడం విడ్డూరమన్నారు. ప్రధానంగా ఫీవర్ సర్వే, రోగుల గుర్తింపు సక్రమంగా లేకపోవడం రోగులకు చికిత్సలు అందించడంలో నిర్లక్ష్యం వల్లే ఇలాంటి పరిస్థితి తలెత్తిందని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసులు ఉద్ధృతికి మీ పనితనం అద్దం పడుతుందని అసహనం వ్యక్తం చేశారు. ఇకనైనా మొక్కుబడి విధులు నిర్వహించడం మానుకొని ప్రాథమిక స్థాయిలో పని చేసే పద్ధతి అలవర్చుకోవాలని సూచించారు. కచ్చితంగా ఇక మీదట మీ పర్యవేక్షణ ఉండాలని, గ్రామస్థాయిలో ఏం జరుగుతుందో ప్రతి సమాచారం మీ వద్ద ఉండాలని చెప్పారు. పకడ్బందీగా ఫీవర్ సర్వేలు, రోగుల గుర్తింపు, ఇంటింటి సర్వే నిర్వహించి కరోనా కట్టడి చేయాలని ఆదేశించారు.

సరైన చికిత్స అందించండి..

ప్రాథమిక స్థాయిలో సర్వేలో గుర్తించిన రోగులకు చికిత్సలు అందించాలని, ఐసోలేషన్ ప్రక్రియ విధానాన్ని సౌకర్యం ఉన్న చోట ఇంటివద్దనే ఏర్పాటు చేయాలని, సౌకర్యాలు లేని వారికి హస్పిటల్​లో ఐసోలేషన్ వార్డులో ట్రీట్మెంట్ అందించాలని సూచించారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లాలోని వెల్దండ, తెలకపల్లి మండలాల్లో రోజురోజుకు కరోనా కేసుల ఉద్ధృతి పెరుగుతోందని అక్కడ వైద్యాధికారులు ఏం చేస్తున్నారని మందలించారు. అక్కడ పరిస్థితి ఏమిటో స్వయంగా వారిని అడిగి తెలుసుకున్నారు. పని తీరులో మార్పు రావాలని ప్రాథమిక స్థాయిలో పకడ్బందీగా ఇంటింటి సర్వేలు చేయించి రోగులను గుర్తించాలని.. ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని వారికి సూచించారు. 33 జిల్లాలతో పోలిస్తే నాగర్ కర్నూలు జిల్లాలో మాత్రమే కేసులు పెరుగుతున్నాయని లాక్ డౌన్ తర్వాత కూడా పెరగడం ఏమిటని సమీక్ష సమావేశంలో చర్చించారు. కేసుల కట్టడి చేసి కరోనా ఉద్ధృతిని తగ్గించాలని సూచించారు.

ఇదీ చూడండి: 'ఐడీ కార్డులు చూడకుండా పోలీసులు లాఠీలకు పని చెప్పొద్దు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.