మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో అటవీ శాఖ కార్యాలయాన్ని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయ ఆవరణలో నీటి నిల్వలపై దోమలు ఉండడాన్ని గమనించిన మంత్రి వెంటనే తొలగించాలని అధికారులను ఆదేశించారు. నీటి నిల్వలు ఉన్న చోటే డెంగీ దోమలు ఉంటాయన్నారు. సమీపంలోని పిచ్చి మొక్కలను కదపగా ఒక్క ఉదుటున దోమలు వచ్చాయి. పరిసర ప్రాంతాల్లో పెరిగిన పిచ్చి మొక్కలని తొలగించాలని సూచించారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలో నీటి నిల్వలు లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు.
ఇదీ చూడండి : 'కల్వకుంట్ల, ఒవైసీ కుటుంబాల చేతుల్లో తెలంగాణ బందీ