ETV Bharat / state

గుండు గీయించిన ఘటనపై భగ్గుమన్న బీసీ నేతలు - demanding-to-arrest-surpunch

మహబూబ్​నగర్​ జిల్లాలోని ముచ్చింతల గ్రామంలో ఇద్దరు యువకులకు గుండు గీయించిన ఘటనపై బీసీ సంఘం నేతలు భగ్గుమన్నారు.  తీర్పు ఇచ్చిన పంచాయతీ పెద్దలపై నాన్​బెయిలబుల్​ కేసులు నమోదు చేయాలని డిమాండ్​ చేశారు.

గుండు గీయించిన ఘటనపై భగ్గుమన్న బీసీ నేతలు
author img

By

Published : May 18, 2019, 7:30 PM IST

మహబూబ్​నగర్​ జిల్లా చిన్నచింతకుంట మండలం ముచ్చింతల గ్రామంలో పంచాయతీ తీర్పు ఇచ్చిన పెద్దలను కఠినంగా శిక్షించాలని బాధితులతో పాటు బీసీ సంఘం నేతలు డిమాండ్​ చేశారు. పంచాయతీ పెట్టి గుండు గీయించాలని తీర్పు చెప్పిన పెద్దలపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయాలని కోరారు. ఈ ఘటనలో ఆత్మహత్య యత్నానికి యత్నించిన యువకుడు రాఘవేందర్​తో పాటు అతని తల్లిదండ్రులు మహబూబ్​నగర్ జిల్లా కలెక్టర్ రోనాల్డ్​రాస్​ను కలిసి జరిగిన ఘటనను వివరించారు. బాధ్యులపై తగు చర్యలు తీసుకోవాలని కోరారు.

గుండు గీయించిన ఘటనపై భగ్గుమన్న బీసీ నేతలు

ఇవీ చూడండి: గుండు తీర్పు ఇచ్చిన పెద్దల అరెస్టు

Intro:TG_Mbnr_02_18_Demanding_To_Arrest_Surpunch_AB_C4

( ) పంచాయతీ తీర్పు ఇచ్చిన పెద్దలను అరెస్టు చేయాలని బాధితులతో పాటు బీసీ సంఘం నేతలు డిమాండ్ చేశారు. పంచాయతీ పెద్దల తీర్పు అమలుతో తీవ్ర ఆవేదనకు గురైన యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడేందుకు యత్నించిన ఘటన శుక్రవారం చిన్నచింతకుంట మండలం ముచ్చింతల గ్రామంలో చోటు చేసుకుంది.

Body:ఈ ఘటనలో ఆత్మహత్య యత్నానికి యత్నించిన యువకుడు రాఘవేంద్రతో పాటు అతని తల్లిదండ్రులు మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోస్ను కలిసి జరిగిన ఘటనపై వివరించారు. బాధ్యులపై తగు చర్యలు తీసుకోవాలని కోరారు.

Conclusion:తన స్నేహితుడు అడిగాడని పశువులు అమ్మేందుకు సాయం చేశానని.. ఈ విషయాన్ని తనే స్వయంగా పంచాయతీ పెద్దలకు చెప్పినా వినిపించుకోలేదని జరిగిన ఘటనను వివరిస్తూ బాధితుడు వాపోయాడు. గ్రామ పంచాయతీ పెద్దలు గుండు గీయించడంతో అవమానానికి గురి ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించానని వివరించాడు. పంచాయితీ పెట్టి గుండు గీయించాలని తీర్పు చెప్పిన పెద్దలను నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసి శిక్షించాలని బీసీ సంక్షేమ సంఘం నేతలు డిమాండ్ చేశారు. సర్పంచ్ తో పాటు బాధ్యులను అరెస్టు చేసి చర్యలు తీసుకోని పక్షంలో రాష్ట్రమంతా ఉద్యమాలు చేపట్టి పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.