ETV Bharat / state

VACCINATION: కొవిడ్‌ వ్యాక్సిన్ల కొరత.. నిరాశతో వెనుదిరుగుతున్న జనం - తెలంగాణ వార్తలు

టీకాల్లేవు... మహబూబ్‌నగర్ జిల్లాలోని వ్యాక్సిన్‌ కేంద్రాల్లో కనిపిస్తున్న బోర్డులివి. ఏ రోజు టీకాలిస్తారో... ఎప్పుడు కేంద్రాలను మూసేస్తారో సాధారణ జనాలకు తెలియని పరిస్థితి. సరిపడా టీకా నిల్వలు సకాలంలో జిల్లాకు రాకపోవడంతో... ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం నుంచే కేంద్రాల వద్ద పడిగాపులు గాసి... టీకాలు లేవని చెప్పడంతో నిరాశగా వెనదిరుగుతున్నారు. జనరల్ ఆస్పత్రుల నుంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వరకూ నిల్వలు నిండుకోవడంతో జిల్లాలో వ్యాక్సినేషన్ అగమ్యగోచరంగా మారింది.

VACCINATION problems in mahabubnagar, vaccine shortage
వ్యాక్సిన్ కొరత, మహబూబ్‌నగర్‌లో టీకా కోసం అవస్థలు
author img

By

Published : Jul 17, 2021, 5:04 PM IST

కొవిడ్‌ వ్యాక్సిన్ల కొరత

మహబూబ్‌నగర్ జిల్లాను కొవిడ్ టీకాల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఎక్కడకు వెళ్లినా టీకాల్లేవనే బోర్డులే దర్శనమిస్తున్నాయి. జిల్లా జనరల్ ఆస్పత్రి, పట్టణ ఆరోగ్య కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రత్యేక టీకా కేంద్రాల్లోనూ.... టీకాలు అందుబాటులో లేవు. ముందురోజు టీకాలొస్తే మరుసటి రోజుకు ఖాళీ అవుతున్నాయి.

నిరాశతో వెనక్కు..

జిల్లాకు గురువారం రాత్రి నాలుగు వేల డోసులొస్తే... శుక్రవారం 24 కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ ఇచ్చారు. శుక్రవారం అర్ధరాత్రి వరకూ టీకాలు రాకపోవడంతో... శనివారం టీకాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. శనివారం కోసం మహబూబ్‌నగర్ జిల్లాలో 16 కేంద్రాల్లో కేవలం 570 డోసులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. 8 కేంద్రాల్లో అసలు టీకాలే లేవు. జిల్లా జనరల్ ఆస్పత్రికి టీకాల కోసం జనం బారులు తీరుతున్నా... నిల్వలు లేవని చెప్పడంతో నిరాశగా వెనుదిరిగి పోతున్నారు. రెండు కేంద్రాల్లో నిత్యం 400 నుంచి 500 మంది వరకూ టీకా కోసం వస్తుండగా... నిల్వలు లేవని వెనక్కి పంపాల్సిన పరిస్థితి వైద్యాధికారులకు ఏర్పడుతోంది.

ప్రత్యేక టీకా కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. డోసులు ఉంటే సాయంత్రం వరకు వచ్చిన వారందరికీ ఇచ్చి పంపుతున్నాం. టీకా లేనప్పుడు వచ్చిన వారికి సమాధానం చెప్పలేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. మూడో దశ భయంతో ప్రజలు టీకా కోసం ఉదయం నుంచే బారులు తీరుతున్నారు.

-డాక్టర్ సుధా, ఎక్స్‌పో ప్లాజా వ్యాక్సినేషన్ సెంటర్ ఇంఛార్జి

టీకా కోసం అన్ని పనులు వాయిదా వేసుకుని కేంద్రానికి వస్తే.. టీకాల్లేవని తిప్పి పంపుతున్నారు. టీకా కోసం రోజుల తరబడి కేంద్రాలకు వస్తున్నాం. అయినా దొరకడం లేదు. మొదటి డోసు టీకా తీసుకొని రెండో డోసు ఎక్కడిస్తారని కేంద్రాల చుట్టూ రోజుల తరబడి ప్రదక్షిణలు చేయాల్సివస్తోంది. కొవిషీల్డ్, కొవాగ్జిన్ అన్నీంటికీ ఒకే కేంద్రం ఏర్పాటు చేశారు. టీకా కేంద్రాల వద్ద ఏర్పాట్లు సరిగా చేయలేదు.

-స్థానికులు

అందరూ టీకాలు తీసుకోవాలని ఓ వైపు ప్రభుత్వం విస్తృత ప్రచారం చేస్తూనే... అందుకు అవసరమైన నిల్వల్ని మాత్రం సకాలంలో పంపిణీ చేయకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవున్నాయి. ప్రభుత్వం తక్షణమే కావాల్సిన డోసులు పంపిణీ చేయాలని జనం కోరుతున్నారు.

ఇదీ చదవండి: Vaccination: ప్రజలకు తప్పని టీకా పాట్లు.. గంటల తరబడి నిరీక్షణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.