గొలుసు దొంగల పట్ల మహిళలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు మహబూబ్నగర్ జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి. జిల్లా కేంద్రంలోని శేషాద్రినగర్లో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. కాలనీలో తిరుగుతూ ఎస్పీ.. గృహిణీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సీసీ కెమెరాల ఆవశ్యకతను కాలనీ వాసులకు వివరించారు. అందరూ కలిసి వీటిని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
ఇవీ చూడండి: ఇద్దరు కూతుళ్లకు ఉరివేసి.. తానూ ఆత్మహత్య