రాష్ట్ర ప్రభుత్వ భవన నిర్మాణ కార్మికుల నిధులను మళ్లించి ప్రభుత్వం ఖజానాను నింపుకుందని తెదేపా జాతీయ అధికార ప్రతినిధి కొత్తకోట దయాకర్ రెడ్డి మహబూబ్నగర్లో ఆరోపించారు. తెలంగాణలో 15లక్షల మంది భవన నిర్మాణ కార్మికులుంటే... లాక్‌డౌన్ నేపథ్యంలో 8లక్షల 50వేల మంది మాత్రమే రెన్యూవల్ చేసుకున్నారని.. మిగతా 6లక్షల 71 వేల మంది దూరంగా ఉన్నారన్నారు.
ఉపాధి లేక రోడ్డున పడ్డ కార్మికులను ప్రభుత్వం వారికి కేటాయించిన నిధులతో ఆదుకోవాల్సింది పోయి.. ఆ మొత్తాన్ని దారి మళ్లించిందని ఆరోపించారు. భవన నిర్మాణ కార్మికుల నిధులు వాడుకోకూడదని సుప్రీం కోర్టు ఆదేశాలు ఉన్న భేఖాతరు చేశారని మండిపడ్డారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అందిన నిధులు, సరుకుల వివరాలు బహిరంగ పర్చాలని కోరారు. వాటి ఖర్చులను సైతం తెలపాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండీ: పెండింగ్‌లోని భూ సమస్యలను పరిష్కరించాలి: కలెక్టర్