మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలను నిరసిస్తూ కాంగ్రెస్ శ్రేణులు నిరసన చేపట్టారు. పట్టణంలోని పెట్రోల్ బంకు ముందు ధర్నా నిర్వహించారు. పెంచిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ఆటోను తాళ్లతోకట్టి లాగి నిరసన తిలిపారు.
కరోనా మహమ్మారి కారణంగా ఉపాధి లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతూ సామాన్యులపై కేంద్రం భారం మోపుతోందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీరుతో ప్రజలు బతకడం కష్టంగా మారిందని చెప్పారు. పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించకుంటే ఆందోళన ఉద్ధృతం చేస్తామని తెలిపారు.
ఇదీ చదవండి: ఎంపీ నామా నాగేశ్వరరావు ఇంట్లో ఈడీ సోదాలు