మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంలో టీపీసీసీ సంయుక్త కార్యదర్శి కాటం ప్రదీప్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు దీక్ష చేపట్టారు. వరుసగా పెరుగుతోన్న ఇంధన ధరలపై నిరసన వ్యక్తం చేశారు.
ఇంధన ధరలు నియంత్రణ చేసి పన్నుల భారాన్ని ప్రజలపై మోపకుండా యూపీఏ ప్రభుత్వం కృషి చేసిందని ప్రదీప్ కుమార్ గౌడ్ తెలిపారు. నిత్యావసరాల ధరలు నిలకడగా ఉంచేందుకు చర్యులు చేపట్టిందన్నారు. నేడు మోదీ ప్రభుత్వం 30 నుంచి 40 శాతం పన్నులను పెంచి.. పేద, మధ్య తరగతుల ప్రజల నడ్డి విరుస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేసి భారీ ర్యాలీగా 16వ జాతీయ రహదారి పై కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దగ్ధం చేస్తూ నిరసన తెలిపారు.
ఇవీ చూడండి: హోంమంత్రి మహమూద్ అలీకి కరోనా పాజిటివ్