మహబూబ్ నగర్ జిల్లాలో కురిసిన భారీ వర్షాలపై కలెక్టర్ వెంకట్రావు.. దేవరకద్ర తహసీల్దార్ కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. వర్షాల పరిస్థితి, జరిగిన నష్టాలు, పల్లె ప్రగతిపై చేపట్టిన కార్యక్రమాలు, రైతు వేదికల నిర్మాణం విషయంలో కొనసాగుతున్న పురోగతిపై సమీక్షించి అసంతృప్తి వ్యక్తం చేశారు.
వారం, పది రోజుల్లో పురోగతి సాధించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అవసరమైతే సస్పెండ్ చేసేందుకైనా వెనకాడబోమని హెచ్చరించారు. అనంతరం కోయిల్ సాగర్ ప్రాజెక్టును సందర్శించి అక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేయవలసిన ఏర్పాట్ల గురించి అధికారులతో కలెక్టర్ మాట్లాడారు. రెవెన్యూ, పంచాయతీరాజ్, పోలీస్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ వెంకట్రావ్ సూచించారు.
కోయిల్ సాగర్ ప్రాజెక్టు వరద నీరు వస్తుండడం వల్ల రెండు గేట్లు పైకెత్తి.. 1400 క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతున్నారు. ప్రాజెక్టు దగ్గర సందర్శకుల తాకిడి పెరిగింది.
ఇదీ చదవండి: పల్లెలను సుందరంగా తీర్చిదిద్దాలి: కలెక్టర్ వెంకట్రావ్