మహబూబ్‌నగర్ లోక్‌సభ ఎన్నికల ఓట్లు లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోస్ తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. సుమారు 20 రౌండ్లు ఉండే అవకాశం ఉందని అన్నారు. సుప్రీంకోర్టు, ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయిన తర్వాత ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బూత్‌లలో 5 వీవీప్యాట్లను లెక్కిస్తామని వెల్లడించారు.
ఇవీ చూడండి: ఎన్నికల ప్రచారం తీర్థయాత్రలా అనిపించింది: మోదీ