అయోధ్య రామాలయ నిర్మాణ ట్రస్టు ఆధ్వర్యంలో పనులు శరవేగంగా జరుగుతున్నాయని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. ఆలయ నిర్మాణానికి అవసరైమన నిధుల్లో భారతీయులందరి భాగస్వామ్యం ఉండాలనే సంకల్పంతో ప్రతి ఇంటి నుంచి విరాళాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. పార్టీలకతీతంగా రామాలయ నిర్మాణంలో భాగస్వాములు కావాలని కోరారు.
మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలోని ప్రసజన్నాంజనేయ స్వామి ఆలయంలో డీకే అరుణ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్థానిక ఆర్ఎస్ఎస్ అనుబంధ సంఘాలతో కలిసి విరాళాలు సేకరించారు. ఎన్నో ఏళ్లుగా హిందువులంతా వేయి కళ్లతో ఎదురుచూస్తున్న అయోధ్య రామయ్య ఆలయం 2023లో పూర్తవుతుందని తెలిపారు.
విరాళాల సేకరణ కార్యక్రమంలో.. జిల్లా సంఘచాలక్ వసంతం వెంకటేశ్, విశ్వహిందూ పరిషత్ జిల్లా ఉపాధ్యక్షుడు చంద్రయ్య, భాజపా మండల శాఖ అధ్యక్షుడు అంజన్ కుమార్ రెడ్డి, వివిధ పార్టీలకు చెందిన నాయకులు, ఆర్ఎస్ఎస్ అనుబంధ సంఘాల కార్యకర్తలు పాల్గొన్నారు.