ETV Bharat / state

CM KCR Nagar Kurnool Tour Today : నేడు నాగర్ కర్నూల్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన - సీఎం కేసీఆర్ పర్యటన

CM KCR Visits Nagar Kurnool Today : ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు నాగర్ కర్నూల్ జిల్లాలో పర్యటించనున్నారు. కొత్తగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్, జిల్లా పోలీసు కార్యాలయం, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలను ప్రారంభించనున్నారు. అనంతరం అక్కడ జరిగే ప్రగతి నివేదన బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

CM KCR Nagar Kurnool Tour Today
CM KCR Nagar Kurnool Tour Today
author img

By

Published : Jun 6, 2023, 6:56 AM IST

Updated : Jun 6, 2023, 7:19 AM IST

నేడు నాగర్ కర్నూల్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన

CM KCR Inaugurate Nagar Kurnool New Collectorate : ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ నాగర్ కర్నూల్ జిల్లాలో పర్యటించనున్నారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రం కొల్లాపూర్ క్రాస్ రోడ్డు సమీపంలో రూ.59 కోట్లతో నిర్మించిన నూతన సమీకృత కలెక్టరేట్ భవనం, రూ.30 కోట్లతో నిర్మించిన జిల్లా పోలీసు కార్యాలయం, బీఆర్ఎస్ జిల్లా కార్యాలయాన్ని ఆయన ప్రారంభించనున్నారు. హైదరాబాద్ నుంచి హెలిక్టాప్టర్‌లో నాగర్ కర్నూల్ చేరుకోనున్న కేసీఆర్.. మొదటగా బీఆర్ఎస్ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. అనంతరం నూతన ఎస్పీ కార్యాలయం, తర్వాత జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు.

CM KCR Visits Nagar Kurnool Today : సాయంత్రం 6 గంటలకు సుమారు లక్షా 50 వేల మందితో నిర్వహించే బహిరంగ సభకు హాజరవుతారని నాగర్ కర్నూల్ శాసనసభ్యులు మర్రి జనార్దన్ రెడ్డి తెలిపారు. సభ అనంతరం భూత్పూరు మీదుగా రోడ్డు మార్గాన తిరిగి రాజధానికి చేరుకుంటారు. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 2019 ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యే సభ కావడంతో సభను విజయవంతం చేసేందుకు బీఆర్ఎస్ నేతలు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు.

CM KCR Nagar Kurnool Tour Today : సీఎం కేసీఆర్ సభ కోసం నాగర్ కర్నూల్ జిల్లా ప్రజలు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. జిల్లాపై వరాల జల్లు కురిపిస్తారని ఆశిస్తున్నారు. సచివాలయం ప్రారంభం కాగానే మొదట పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపైనే సీఎం సమీక్ష నిర్వహించారు. జూన్, జూలైలోపు పనులు పూర్తి చేసి నార్లాపూర్, ఏదుల, వట్టెం, కరివెన జలాశయాల వరకూ సాగునీరు పారించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ మేరకు ప్రగతి నివేదన సభలో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం సహా జిల్లాలోని ఇతర సాగునీటి ప్రాజెక్టుల పూర్తిపై ప్రకటనలు చేసే అవకాశం ఉందని స్థానిక ప్రజలు యోచిస్తున్నారు. ఉమ్మడి నాగర్ కర్నూల్‌లో ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. దీనిపై కూడా కేసీఆర్ సానుకూల ప్రకటన చేసే అవకాశం ఉందని బీఆర్ఎస్ నేతలు, ప్రజాప్రతినిధులు భావిస్తున్నారు.

నాగర్​ కర్నూల్​ జిల్లాలో ట్రాఫిక్ ఆంక్షలు : సీఎం పర్యటన నేపథ్యంలో నాగర్ కర్నూల్ జిల్లాలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ప్రభుత్వాసుపత్రి నుంచి మంతటి వరకూ.. పట్టణం నుంచి నూతన కలెక్టరేట్ కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో సాధారణ ప్రజల వాహనాల రాకపోకల్ని నిలిపివేయనున్నారు. నాగర్ కర్నూల్ నుంచి అచ్చంపేట, శ్రీశైలం వైపు వెళ్లే వాహనాలను ట్యాంక్ బండ్ మీదుగా తాడూరు, మంతటి చౌరస్తాకు మళ్లించనున్నారు. నాగర్ కర్నూల్ మీదుగా కొల్లాపూర్ వెళ్లాల్సిన వాహనాల్ని నాగనూలు చౌరస్తా, నాగనూలు, ఎండబట్ల క్రాస్ రోడ్డు మీదుగా కొల్లాపూర్ వైపునకు మళ్లిస్తారు. అచ్చంపేట నుంచి మహబూబ్​నగర్ వెళ్లే వాహనాల్ని మంతటి, తాడూరు, ఉయ్యాలవాడ, బిజినెపల్లి మీదుగా పంపనున్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Jun 6, 2023, 7:19 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.