ETV Bharat / state

సబ్బండ వర్గాలకు సంబురమే..! - కేంద్ర ప్రభుత్వం

కొవిడ్‌-19 లాక్‌డౌను నేపథ్యంలో కేంద్రం ప్రకటిస్తున్న ‘ఆత్మ నిర్భర్‌ భారత్‌ అభియాన్‌’ పేదలపాలిట వరంగా మారుతోంది. బుధవారం ప్రకటించిన ప్యాకేజీ ద్వారా ఉమ్మడి పాలమూరులోని 3,526 సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు, వాటిలో పనిచేసే 32 వేల కార్మికులకు లబ్ధి చేకూరనుండగా.. తాజాగా కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ గురువారం వివిధ వర్గాలకు ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించారు. ప్రధానంగా కర్షకులు, కార్మికవర్గాలు ఎక్కువగా ఉన్న ఉమ్మడి పాలమూరు జిల్లాకు కేంద్ర సర్కారు ప్యాకేజీ ఎంతో ఊరట ఇవ్వనుంది.

old mahabubnagar district latest news
old mahabubnagar district latest news
author img

By

Published : May 15, 2020, 10:45 AM IST

కేంద్ర ప్రభుత్వం రైతులకు ప్రకటించిన వరాలతో ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లాలో ప్రత్యక్షంగా, పరోక్షంగా కలిపి సుమారు 7.50 లక్షల వ్యవసాయ కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. మరోవైపు.. నల్లమలలో ఉండే గిరిజనులకు కంపా (ప్రత్యామ్నాయ అటవీకరణ పథకం) నిధులతో ఉపాధి అవకాశాలు మరింత మెరుగుకానున్నాయి.

పాలమూరు జిల్లాల్లో 2.76 లక్షల రైతులకు కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు ఉన్నాయి. వీరందరికీ రాయితీతో కూడిన రుణాలు అందించనున్నారు. అర్హులకు కొత్త క్రెడిట్‌ కార్డులు ఇస్తారు. ఈ లెక్కన మరో 30 వేల మందికి కొత్తగా కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు వచ్చే అవకాశముంది. దీంతో పాటు చిన్న, సన్నకారు రైతులకు బ్యాంకర్లు తక్కువ వడ్డీకి రుణాలు ఇవ్వనున్నారు. ఖరీఫ్‌ పంటల సాగుకు అన్నదాతలు ఇప్పుడు సిద్ధమవుతున్నారు. విత్తనాలు, ఎరువులకు ఏటా వ్యాపారుల వద్ద అప్పులు చేసే చిన్న, సన్నకారు రైతులకు తక్కువ వడ్డీకే బ్యాంకు రుణాలు చేతికి అందనున్నాయి.

కంపా ద్వారా గిరిజనులు, ఆదివాసీలకు ఉపాధి...

కంపా పథకం కింద నాగర్‌కర్నూలు జిల్లాలోని 2.50 లక్షల హెక్టార్ల అటవీ భూములతోపాటు మహబూబ్‌నగర్‌, నారాయణపేట, గద్వాల, వనపర్తి జిల్లాల్లోని మరో లక్ష హెక్టార్ల అటవీ భూముల్లో మొక్కలు నాటడం, నర్సరీల పెంపకం, కందకాల తవ్వకం, సాసర్ల నిర్మాణం వంటి పనులు చేపట్టనున్నారు. ఈ పనులతో 12,340 మంది గిరిజనులు, ఆదివాసీలకు ఉపాధి లభించనుంది.

వీధి వ్యాపారులకు రుణ సదుపాయం...

ఉమ్మడి పాలమూరులోని తొమ్మిది ప్రధాన పురపాలికల్లో 3,200 మంది వీధి వ్యాపారాలు చేసుకొంటున్నారు. కొవిడ్‌-19 లాక్‌డౌన్​తో వీరంతా ఇళ్లకే పరిమితమై ఆర్థికంగా నష్టపోయారు. వీరి జీవన స్థితిగతులు మళ్లీ మెరుగుపర్చడానికి ప్రత్యేక రుణ సదుపాయం కల్పిస్తారు. ప్రధానంగా మహబూబ్‌నగర్‌, గద్వాల, వనపర్తి, నారాయణపేట, నాగర్‌కర్నూలు, జడ్చర్ల, మక్తల్‌, కల్వకుర్తి పురపాలికల్లో ఎక్కువసంఖ్యలో వీధి వ్యాపారులున్నారు.

  • ఉమ్మడి జిల్లాలో ముద్ర రుణాల ద్వారా గతేడాది 4,894 మంది లబ్ధి పొందారు. వీరు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొంటున్నారు. లాక్‌డౌనుతో ఈఎంఐ కట్టలేని దుస్థితి ఉంది. వీరికి చెల్లింపుల్లో సడలింపుల ద్వారా ఊరట కలగనుంది.
  • ఉమ్మడి జిల్లాలో 73,916 మంది ఈపీఎఫ్‌ లబ్ధిదారులు ఉన్నారు. ఇందులో 32 వేల మంది కార్మికులే. వీరికి ఆర్నెల్లపాటు ప్రభుత్వమే ఈపీఎఫ్‌ వాటా భరించనుంది. ఈ లెక్కన ఏడాదికి సుమారుగా రూ.9 కోట్ల మేర ఈపీఎఫ్‌ వాటా రానుంది.

మరో రెండు నెలలపాటు రేషన్‌కార్డు వినియోగదారులకు ప్రభుత్వం ఉచితంగా నెలకు 5 కిలోల బియ్యం, కిలో కందిపప్పు చొప్పున పంపిణీ చేయనుంది. దీని ద్వారా ఉమ్మడి జిల్లాలో రేషన్‌ కార్డులున్న 9,30,054 కుటుంబాలు లబ్ధి పొందుతాయి. వీరితోపాటు కార్డులు లేని వారిక్కూడా రేషను సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా మరో లక్ష కుటుంబాలకు రేషను అందనుంది. ఇదేవిధంగా ఇతర రాష్ట్రాల నుంచి పాలమూరు జిల్లాలకు 22 వేల కార్మికులు వచ్చారు. వీరికీ ఉచిత రేషను ఇవ్వనున్నారు.

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 6.11 లక్షల జాబ్‌కార్డులు ఉన్నాయి. 15 లక్షల ఉపాధిహామీ కూలీలు ఉంటారు. వీరికి రోజుకూలీ గరిష్ఠంగా రూ.237 వరకు ఇస్తారు. ఇపుడు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కూలీలను కూడా గుర్తించి ఉపాధిహామీ పనులు కల్పిస్తారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.