మహబూబ్నగర్ జిల్లా ముసాపేట మండలం ఎన్హెచ్44 జాతీయ రహదారిపై రెయిన్ బో హోటల్ సమీపంలో కారు దగ్ధమైంది. పెబ్బేరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న కారులో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. షార్ట్ సర్క్యూట్ కావడం వలన మంటలు వ్యాపించి పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగకపోవటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఇదీ చూడండి: మద్దతు ధరల జాబితాలో పసుపును చేర్చాలి