ETV Bharat / state

ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి - ఉత్కంఠగా ఎదురుచూస్తున్న జిల్లా వాసులు - పాలమూరు జిల్లా ఎన్నికల ఫైట్‌ 2023

Arrangements For Counting in Palamuru district : ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 14 నియోజక వర్గాల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. 7 చోట్ల ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాల్లో ఆదివారం ఓట్ల లెక్కింపు కొనసాగనుంది. ఒక్కో రౌండ్‌కు 14 టేబుళ్లు ఏర్పాటు చేసిన అధికారులు 20 నుంచి 22 రౌండ్లలో పూర్తి ఫలితాలు వెల్లడించనున్నారు. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుతో కౌంటింగ్ ప్రారంభమవుతుంది. గత ఎన్నికల్లో 14 స్థానాలకు 13 గెలుచుకున్న బీఆర్‌ఎస్‌ అదే ఒరవడి కొనసాగిస్తుందా లేదా హస్తం క్లీన్ స్వీప్ చేస్తుందానని ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

Arrangements For Counting
Arrangements For Counting in Palamuru district
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 2, 2023, 6:36 PM IST

Arrangements For Counting in Palamuru District : ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని 14 నియోజక వర్గాల్లో జరిగిన శాసనసభ ఎన్నికల(Telangana Assembly Elections 2023) ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. 7చోట్ల 14 నియోజక వర్గాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు జరగనుంది. మహబూబ్ నగర్ జిల్లాలో పాలమూరు విశ్వవిద్యాలయం పరీక్షల విభాగం భవనంలో కౌంటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మహబూబ్ నగర్, జడ్చర్ల, దేవరకద్ర నియోజకవర్గాల లెక్కింపు అక్కడ కొనసాగనుంది. నారాయణపేట జిల్లాలోని మక్తల్, నారాయణపేట ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని సింగారం చౌరస్తాలోని ఓ ప్రైవేటు కళాశాల భవనంలో సిద్ధం చేశారు. నాగర్ కర్నూల్ జిల్లాలోని కొల్లాపూర్, అచ్చంపేట, నాగర్ కర్నూల్ ఓట్ల లెక్కింపు నాగర్ కర్నూల్ వ్యవసాయ మార్కెట్ యార్డు గోదాముల్లో చేయనున్నారు.

కల్వకుర్తి నియోజక వర్గం ఓట్ల లెక్కింపు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మంగల్ పల్లిలోని ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాల భవనంలో ఏర్పాటు చేశారు. వనపర్తి ఓట్ల లెక్కింపు చిట్యాల వ్యవసాయ మార్కెట్ యార్డు గోదాంలో, కొండగల్ ఓట్ల లెక్కింపు పరిగి వ్యవసాయ మార్కెట్ గోదాములో, షాద్ నగర్ ఓట్ల లెక్కింపు హిమాయత్ సాగర్‌లోని ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలో జరగనుంది. ప్రతి నియోజక వర్గానికి ఒక్కో రౌండ్‌కు 14 టేబుళ్లు ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాలు, ఈవీఎంల సంఖ్య ప్రకారం 20 నుంచి 22 రౌండ్లలో ఫలితాలు వెల్లడికానున్నాయి. ఉదయం 8 గంటల నుంచి లెక్కింపు ప్రారంభం(Vote Counting) కానుంది. ఈవీఎం(EVM) యంత్రాల్లో లెక్కింపు అవ్వడం వల్ల మధ్యాహ్నానికి అన్ని ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

ఓట్ల లెక్కింపునకు వరంగలో భారీ ఏర్పాట్లు - పోలీసుల గట్టి బందోబస్తు

Political War in Palamuru District : 14నియోజక వర్గాల్లో మొత్తం 33,71,398 మంది ఓటర్లు ఉండగా, 26,97,938 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. 200మంది అభ్యర్థుల భవితవ్యం ప్రస్తుతం ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. బీఆర్‌ఎస్‌ పార్టీ ఈ ఎన్నికలో 14 నియోజక వర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలనే అభ్యర్థులుగా ప్రకటించింది. చివరి నిమిషంలో అలంపూర్ నియోజక వర్గ అభ్యర్థి అబ్రహంను మార్చి విజయ్‌కు బీఫాం ఇచ్చారు. బీఆర్‌ఎస్‌(BRS) అభ్యర్థుల్లో మంత్రి శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి, మాజీ మంత్రి లక్ష్మారెడ్డి సహా సిట్టింగ్ ఎమ్మెల్యేల భవితవ్యం ఆదివారం(రేపు) తేలనుంది. కాంగ్రెస్ విడతల వారీగా అభ్యర్థులను ప్రకటించి బరిలో నిలిపింది. స్వయంగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజక వర్గం నుంచి బరిలో ఉన్నారు.

Telangana Assembly Elections 2023 : ఆయనతో పాటు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, యెన్నం శ్రీనివాస్ రెడ్డి, అనిరుద్ రెడ్డి, జీఎంఆర్, చిట్టెం పర్ణికరెడ్డి, వాకిటి శ్రీహరి, సరితా తిరుపతయ్య, కూచుకుళ్ల రాజేష్ రెడ్డి, మేఘారెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, చిక్కుడు వంశీకృష్ణ, వీర్లపల్లి శంకర్ భవితవ్యం కౌంటింగ్ కేంద్రాల్లో తేలనుంది. 14 నియోజక వర్గాల్లోనూ బీజేపీ అభ్యర్థులను నిలిపినా మహబూబ్ నగర్, మక్తల్, కల్వకుర్తి నియోజక వర్గాల్లో అభ్యర్థుల ఫలితాలపై ప్రభావం చూపనున్నారు. సామాజిక మాధ్యమ సంచలనం బర్రెలక్క కూడా కొల్లాపూర్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఉన్నారు. ఆమెకు ఎన్ని ఓట్లు(Vote) వస్తాయో కూడా రేపే తేలనుంది.

ఉమ్మడి పాలమూరు జిల్లాలో పొలిటికల్ హీట్ - విజయం వరించేదెవరినో​?

రేపే జడ్జిమెంట్ డే- ఎలక్షన్ కౌంటింగ్​కు ఈసీ ఏర్పాట్లు పూర్తి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.