ETV Bharat / state

'అనాజ్‌ గ్యారేజ్‌'.. ఇచ్చట అన్ని రకాల కార్లు దొరుకుతాయి.. కానీ..! - Anaj Faizi making paper cars in Mahbubnagar

రోడ్లపై నిత్యం ఎన్నో కార్లను చూస్తుంటాం. రకరకాల ప్రత్యేకతలతో మార్కెట్లోకి వచ్చే లగ్జరీ కార్లను చూస్తుంటే కొనాలని అనిపించక తప్పదు. అలాగని.. కొత్తగా వచ్చే ప్రతి కారునూ కొనాలంటే ఎవరికీ సాధ్యపడదు. కానీ.. ఆటోమోటీవ్‌ పరిశ్రమ నుంచి బయటికి వచ్చే ప్రతీ కారు తన ఇంట్లో ఉండాల్సిందే అంటున్నాడు ఓ యువకుడు. అలా.. దాదాపు 355 రకాల కార్లను తన ఇంట్లో ప్రదర్శనగా ఉంచాడు. ఇంతకీ.. ఒకే ఇంట్లో 355 రకాల కార్లేంటి..? అన్ని కార్లతో అతడేం చేస్తున్నాడు అనుకుంటున్నారా..? ఈ కార్ల ఫాంటసీ గురించి తెలుసుకోవాలంటే మహబూబ్‌నగర్‌కు వెళ్లాల్సిందే.

'అనాజ్‌ గ్యారేజ్‌'.. ఇచ్చట అన్ని రకాల కార్లు దొరుకుతాయి.. కానీ..!

author img

By

Published : Sep 17, 2022, 3:33 PM IST

'అనాజ్‌ గ్యారేజ్‌'.. ఇచ్చట అన్ని రకాల కార్లు దొరుకుతాయి.. కానీ..!

Paper Cars in Mahbubnagar: పైన కనిపిస్తోన్న దృశ్యాల్ని చూస్తే ఏమనిపిస్తోంది..? కార్లన్నీ ఓ చోట పద్ధతిగా పార్కింగ్‌ చేసినట్లుగా అనిపిస్తోంది కదూ. మీరు చూసేవన్నీ కార్లలాగే ఉన్నా.. ఇవి నిజమైనవి మాత్రం కావు. వాటిని ఎక్కడా పార్కింగ్‌ చేయలేదు. కార్లంటే ఎంతో ఇష్టపడే ఓ యువకుడు కాగితంతో ఇలా రకరకాల డిజైన్లను తయారు చేసి.. ఔరా అనిపిస్తున్నాడు. కేవలం కార్లు మాత్రమే కాదు.. బైక్‌లు, పోలీసు, మిలిటరీ వాహనాలు, అంబులెన్సులు.. ఇలా ఎన్నో రకాల వాహనాలను తన కళతో రూపుదిద్దుతున్నాడు మహబూబ్‌నగర్ న్యూటౌన్‌కు చెందిన అనాజ్‌ ఫైజీ.

బీటెక్ పూర్తి చేసిన ఫైజీకి కార్లంటే చాలా ఇష్టం. చిన్నప్పుడే చూసిన కారునల్లా కొనేద్దామనుకునే వాడు. కానీ అన్నింటినీ కొనడం సాధ్యం కాదు కదా.. అందుకే వాటిని కాగితంతో స్వయంగా తయారు చేసి వాటిని చూస్తూ మురిసిపోయేవాడు. క్రమంగా తనకు అదే అలవాటుగా మారిపోయింది. 9 ఏళ్ల వయసున్నప్పటి నుంచి తన సృజనాత్మకతకు పదును పెట్టిన అనాజ్‌.. దళసరిగా ఉన్న కాగితాలు దొరికితే వాటిని దాచిపెట్టి.. బొమ్మకార్లు రూపొందిస్తుండేవాడు. ఎక్కడ ఏ వాహనం కనిపించినా.. వాటిని చూసి కొలతలు వేసి.. బొమ్మను గీసేస్తాడు. ఆ బొమ్మకు రంగులు వేసి.. కత్తిరించి.. నమూనాకు అనుగుణంగా తిరిగి అతికిస్తాడు. చూడ్డానికి అచ్చం నిజమైన కారులా కనిపించేలా తీర్చిదిద్దుతాడు. అతను చేసే బొమ్మ కనిష్ఠంగా 3 సెంటిమీటర్ల నుంచి గరిష్ఠంగా 7 సెంటీమీటర్ల పొడవు మాత్రమే ఉంటుంది. ఒక్కో కారు తయారు చేసేందుకు 20 నిమిషాల నుంచి 2 గంటల వరకూ సమయం పడుతుందని అనాజ్‌ చెబుతున్నాడు.

అవకాశం వస్తే పిల్లలకూ..: కేవలం వాహనాలు మాత్రమే కాకుండా ఈఫిల్ టవర్, బుర్జ్ ఖలీఫా లాంటి ప్రపంచంలోని చారిత్రక కట్టడాల నమూనాలను కాగితంతో తీర్చిదిద్ది.. వారెవ్వా అనిపిస్తున్నాడు ఫైజీ. భవిష్యత్తులో విమానాలు, హెలికాప్టర్లు, ఓడలు, సబ్‌ మెరైన్‌ లాంటివి కూడా తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. అయితే తన ప్రతిభను ప్రదర్శించేందుకు.. ఇప్పటి వరకూ వేదిక దొరకలేదంటున్న ఫైజీ.. అవకాశం వస్తే పిల్లలకు కాగితంతో ఇలాంటి బొమ్మలు ఎలా తయారు చేయాలో నేర్పుతానంటున్నాడు.

సృజనాత్మకతను వెలికితీసేందుకు ఎంతో దోహదం..: పైసా ఖర్చు లేదు. పెద్దగా సమయమూ వృథాపోదు. పైగా ఆటవిడుపు. మెదడుకూ పదును. క్షణం తీరిక దొరికితే చాలు మొబైళ్లకు అతుక్కుపోతున్న నేటి పిల్లల్లోని సృజనాత్మకతను వెలికితీసేందుకు కాగితపు బొమ్మల తయారీ ఎంతో దోహదం చేస్తుందని అనాజ్‌ చెబుతున్నాడు.

ఇవీ చూడండి..

బాండ్ల విక్రయం ద్వారా రుణమొత్తాన్ని రూ.500 కోట్లకు తగ్గించిన ప్రభుత్వం

మహేశ్, జక్కన్న చిత్రం.. తెలుగు, ఇంగ్లిష్​లో ఒకేసారి షూటింగ్!.. రిలీజ్ డేట్ ఇదే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.