ETV Bharat / state

అంబేడ్కర్ వల్లే రాష్ట్రం సాధ్యమయింది: శ్రీనివాస్ గౌడ్

అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం ద్వారానే మనకు ప్రత్యేక రాష్ట్రం కల స్వప్నించిందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. మహబూబ్​నగర్​ జిల్లాలో 20వ అంబేడ్కర్ జాతర వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్రం ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అభివృద్ధిలో పెద్ద పీట వేస్తుందని వెల్లడించారు.

అంబేడ్కర్ జాతరలో పాల్గొన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్
author img

By

Published : Apr 21, 2019, 10:36 AM IST

Updated : Apr 21, 2019, 3:28 PM IST

రాజ్యాంగంలో అంబేడ్కర్‌ రాసిన ఆర్టికల్‌ 3 ప్రకారమే తెలంగాణను ఏర్పాటు చేసుకునే అవకాశం కలిగిందని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా పరిషత్ మైదానంలో నిర్వహించిన 20వ అంబేడ్కర్‌ జాతరలో పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు పెద్ద పీట వేసి అభివృద్ధి పరుస్తున్నామని మంత్రి తెలిపారు. ఇప్పటికే ప్రత్యేక గురుకులాలు పెట్టి కార్పోరేట్‌ స్థాయిలో ఉచిత విద్యను అందిస్తున్నామన్నారు. జిల్లా కేంద్రంలో ప్రత్యేకంగా స్థలాన్ని కేటాయించి అందరి మహానుభావుల విగ్రహాలు ఏర్పాటు చేసుకునే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

అంబేడ్కర్ జాతరలో పాల్గొన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్

ఇవీ చూడండి: సోహన-వినయ్ వివాహ వేడుకలో ప్రముఖులు

Intro:tg-mbnr-1-15-vilina-gramala-samasyalu-pkg-c13

నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం లోని 8 గ్రామాల ప్రజలు ఆందోళనలో ఉన్నారు అనుకున్నది జరుగుతుందా జరగదా అని ఆలోచిస్తున్నారు మళ్లీ ఆ రోజులు వస్తే ఎంత బాగుండు అని అనుకుంటున్నారు

అసెంబ్లీ ఎలక్షన్లకు ముందు అచ్చంపేట ను పురపాలక సంఘంగా మార్చి పట్టణ పరిధి చుట్టూ ఉన్న 8 గ్రామాలు లక్ష్మాపూర్ ,నడింపల్లి ,పులిజాల ,లింగోటం ,పోలిశెట్టి పల్లి, చౌటపల్లి,గుంపన్ పల్లి గ్రామాలను అచ్చంపేట పురపాలక సంఘం లో విలీనం చేశారు అప్పటినుండి ఆ గ్రామాలలో అలజడులు ప్రారంభమయ్యాయి అచ్చంపేట పురపాలక సంఘంలో కలవద్దని తమ గ్రామాలను గ్రామ పంచాయతీలు గానే ఉంచాలని ధర్నాలు చేశారు అయినా ఫలితం లేకపోయింది

Body:మున్సిపాలిటీలో కలవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇప్పటికే ఆ గ్రామాల్లో తాగునీటి సమస్య ఉంది భగీరథ నీరు వచ్చినది కొన్ని ప్రాంతాలకే పరిమితం అయ్యింది భూగర్భ జలాలు లేక కొన్ని బోర్లు ఎండిపోయాయి కొన్నింటిలో నీరు ఉన్న మోటర్లు బిగించ లేదు దూర ప్రాంతాల నుండి ప్రజలు మంచి నీటిని మోసుకొస్తున్నారు ఉన్న బోరింగ్ లు రిపేర్లు కూడా చేయడం లేదు రోడ్లు భగీరథ పైప్లైన్ ల కోసం తవ్వారు సరి చేయలేదు కొన్ని కాలనీలలో అంతర్గత రోడ్లు కూడా కొంత వరకే పూర్తయ్యాయి మరికొన్ని చోట్ల రోడ్లు లేవు ఉన్న వాటిని తవ్వి పాడు చేశారు మురికి కాలువలు కూడా అంతంతమాత్రంగానే ఉన్నాయి కొంతవరకుపూర్తి చేసి వదిలేశారు కొన్ని చోట్ల నిర్మించారు కానీ ఆ కాలువలు మట్టి పూడుకుపోయి అక్కడ కాలువ ఉందా లేదా తెలియడం లేదు మరి కొన్ని చోట్ల కాలువలో చెత్త తీయడం లేదు నీరు ఆగి దుర్గంధం వెదజల్లుతోంది పారిశుధ్య పని వారు కూడా లేరు గ్రామాలలో మరుగుదొడ్ల కూడా అసంపూర్తిగా ఉన్నాయి పూర్తిగా నిర్మించిన వారికి కూడా బిల్లులు రాలేదు కరెంటు స్తంభాలు వేశారు వైర్లు బిగించ లేదు మరికొన్ని ప్రాంతాలలో వీధి లైట్లు కూడా లేవు ఇళ్ల మధ్యనే కంప చెట్లు కూడా ఉన్నాయి వాటిని తొలగించడం లేదు పురపాలక సంఘం లో విలీనం వల్ల ప్రతి చిన్న పనికి కూడా అచ్చంపేట వెళ్ళవలసి వస్తుంది కొన్ని సందర్భాలలో వెళ్లినప్పుడు అధికారులు సమయానికి ఉండక పనులు కావడం లేదు మళ్లీ మరొకసారి వెళ్ళవలసి వస్తుంది అధికారులు స్పందించడం లేదు అధికారులు గ్రామాలను సందర్శించిన దాఖలాలు లేవు

Conclusion:మున్సిపాలిటీ లో కలవడం వల్ల ఉపాధి పనులు ఆగిపోయాయి పని చేసుకుని బతికే వారికి పని లేక అలమటిస్తున్నారు మళ్లీ మా గ్రామాలను గ్రామ పంచాయతీలు గా మారుస్తామని నాయకులు మాట ఇచ్చారు వారు తమ మాటను నిలబెట్టుకోవాలని మా గ్రామాలను గ్రామ పంచాయతీగా చేయాలని కోరుతున్నారు
దీనిపై స్పందించడానికి అధికారి అందుబాటులో లేడు

బైట్స్

చౌటసుధాకర్
దశరథ్ రెడ్డి
సుల్తాన్ గౌడ్
గోపాల్ రెడ్డి
మల్లేష్
నిరంజన్
Last Updated : Apr 21, 2019, 3:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.