ETV Bharat / state

ఒకరోజు 'సీఎం' స్టైల్లో - ఒక్క రోజు 'బ్రిటిష్ డిప్యూటీ​ హై కమిషనర్'గా తెలంగాణ విద్యార్థి - BRITISH DEPUTY HIGH COMMISSIONER

అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా పోటీలు - తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల పరిధిలో ఎంపికైన జయలక్ష్మి - ఒక్కరోజు బ్రిటిష్​ హై కమిషనర్​గా బాధ్యతలు

BRITISH DEPUTY HIGH COMMISSIONER
జయలక్ష్మికి ధ్రువపత్రాన్ని అందజేస్తున్న డిప్యూటీ హైకమిషనర్‌ గారెత్‌ విన్‌ ఓవెన్‌ (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 27, 2024, 11:15 AM IST

One Day Deputy High Commissioner : సామాన్యులను ఒక్కరోజు ముఖ్యమంత్రి.. ఒక్క డీజీపీ చేయడం లాంటి సీన్స్​ సినిమాల్లోనే చూస్తుంటాం. ఎందుకంటే సినిమా లైఫ్​కు రియల్​ లైఫ్​కు చాలా తేడా ఉంటుంది. అక్కడ చేసినవన్నీ రియల్​ లైఫ్​లో చేయడానికి వీలు కాదు. కానీ ఈ సీన్​లు చూస్తే అచ్చం రియాలిటీలో సినిమాను చూపించారు. గతంలో ఐపీఎస్​ మహేశ్​ భగవత్​ క్యాన్సర్​తో బాధపడుతున్న బాలుడి కోరికను తీర్చారు. జీవితంలో ఎలాగైనా పోలీసు కావాలనే కోరికతో ఉన్న బాలుడి గురించి తెలుసుకొని.. బాలుడి జీవిత ఆశయాన్ని మహేశ్​ భగవత్​ నెరవేర్చారు. ఒక్కరోజు రాచకొండ పోలీస్​ కమిషనర్​గా విధులు నిర్వహించడానికి అవకాశం ఇచ్చారు. ఇప్పుడు అలాంటి సీన్​నే రిపీట్​ అయింది.. అది ఓ బాలిక బ్రిటీష్​ డిప్యూటీ హై కమిషనర్​గా బాధ్యతలు నిర్వర్తించింది. ఇంతకీ ఎక్కడో తెలుసా? ఎందుకో తెలుసా?

అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్​కు చెందిన అరిపిన జయలక్ష్మి బ్రిటిష్‌ డిప్యూటీ హైకమిషనర్‌గా సోమవారం ఒకరోజు బాధ్యతలు నిర్వహించినట్లు నగరంలోని డిప్యూటీ హై కమిషనర్‌ కార్యాలయం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఒకరోజు డిప్యూటీ హైకమిషనర్‌గా వ్యవహరించేందుకు బ్రిటిష్‌ హైకమిషన్‌ 2017 నుంచి ఏటా దీనికి సంబంధించిన పోటీలు నిర్వహిస్తోంది.

One Day Deputy High Commissioner
జయలక్ష్మికి ధ్రువపత్రాన్ని అందజేస్తున్న డిప్యూటీ హైకమిషనర్‌ గారెత్‌ విన్‌ ఓవెన్‌ (ETV Bharat)

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల పరిధిలో నిర్వహించిన పోటీల్లో జయలక్ష్మి ఎంపికయ్యారు. హైదరాబాద్‌కు చెందిన జయలక్ష్మి ప్రస్తుతం సామాజిక కార్యకర్తగా పని చేస్తున్నారు. ఒక రోజు డిప్యూటీ కమిషనర్‌ హోదాలో ఆమె సికింద్రాబాద్​లోని ప్రాంతీయ పాస్‌పోర్ట్‌ అధికారి స్నేహజ జొన్నలగడ్డతో పాటు మై ఛాయిస్‌ ఫౌండేషన్‌, డబ్ల్యూఈ హబ్ ప్రతినిధులతో వివిధ అంశాలపై మాట్లాడి పలు విషయాలను తెలుసుకున్నారు. బ్రిటీష్‌ డిప్యూటీ హైకమిషనర్‌ గారెత్‌ విన్‌ ఓవెన్‌ జయలక్ష్మి నివాసానికి వెళ్లి సంబంధిత సర్టిఫికేట్​ను అందచేశారు.

లింగ సమానత్వం : దీని ఉద్దేశం కేవలం దౌత్య ప్రపంచంలోకి తీసుకెళ్లే మంచి ప్రయత్నం అని తెలిపారు. ఇదే కాకుండా యువతులకు సాధికారత కల్పించడం, లింగ సమానత్వాన్ని సాధించడం. కాగా దీనికి ఈ సంవత్సరం దాదాపు వందల సంఖ్యలో యువతులు దరఖాస్తు చేసుకోగా అందులోనుంచి నిర్వాహకులు జయలక్ష్మీని ఎంపిక చేశారు. దీంతో ఆమె వివిధ రంగాలలోని మహిళా నాయకులతో అర్థవంతమైన చర్చలలో పాల్గొనే అవకాశాన్ని ఉపయోగించుకున్నారు. ఇందులో భాగంగానే జయలక్ష్మీ ఒక్క రోజు బ్రిటీష్ హైకమీషనర్ బాధ్యతలు నిర్వహించింది. ఇందులో 18 నుంచి 23 ఏళ్ల వయస్సు గల భారతీయ మహిళలకు మాత్రమే ఈ అవకాశాన్ని కల్పిస్తున్నారు.

బన్నీ ఫ్యాన్స్​కు గుడ్​న్యూస్- ఒక్కరోజు ముందుగానే 'పుష్ప 2' రిలీజ్

రూ.99కే సినిమా టికెట్‌ - ఆ ఒక్కరోజు మాత్రమే ఈ బంపర్​ ఆఫర్! - Rs 99 Movie Ticket Offer

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.