కరోనా విజృంభిస్తోన్న వేళ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ సిలిండర్ల నిల్వలు లేవని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలంలోని పోలేపల్లి పారిశ్రామికవాడలో ఉన్న ఆక్సిజన్ నిల్వ చేసి సరఫరా చేసే ఎలెన్ బెర్రీ పరిశ్రమలో అదనపు కలెక్టర్ సీతారామరావు, ఆర్డీవో శ్రీనివాసులు స్థానిక అధికారులు తనిఖీలు నిర్వహించారు.
అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు ఆక్సిజన్ సరఫరా చేస్తున్న తీరు అక్కడున్న నిల్వలను పరిశీలించారు. సిబ్బందితో వివరాలు ఆరా తీశారు. ప్రస్తుతం సరఫరా అంతా సజావుగానే కొనసాగుతున్నదని ఆక్సిజన్ కొరత లేదని వారు అధికారులకు తెలిపారు. సరఫరాలో ఇబ్బందులు లేకుండా చూడాలని సీతారామరావు కంపెనీ ప్రతినిధులను ఆదేశించారు.
ఇదీ చూడండి : నేడు ఈసెట్ పరీక్ష... కరోనా కాలంలో తొలి పరీక్ష