మహబూబ్‌నగర్ జిల్లాలో లేగదూడలపై వరుసగా చిరుత పులి దాడి చేయడం పశువుల కాపరులను భయాందోళనకు గురిచేస్తోంది. జిల్లాలోని వెంకటయ్య పల్లి , నాగారం, చౌదర్‌పల్లిలో శుక్ర, శని, ఆదివారం రోజుల్లో చిరుత దాడిలో దూడలు మృతి చెందాయి..
రెండు నెలలుగా..
అప్పుడప్పుడు లేగదూడలపై దాడి చేయడం, రైతులకు కనిపిస్తుండటంతో రెండు నెలలుగా ఈ ప్రాంత ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. చౌదర్‌పల్లి, గద్దెగూడెం, మన్యంకొండ అటవీ ప్రాంతంలోని గుట్టల్లో గత కొంత కాలంగా చిరుత పులి సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు.
ఈ ఘటనలు పశువుల కాపరులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. అధికారులు స్పందించి చిరుతను బంధించి పెద్ద అటవీ ప్రాంతంలో వదిలి పెట్టాలని కోరుతున్నారు.
ఇదీ చూడండి: ఇల్లందుకు ప్రత్యేక గుర్తింపు.. స్వచ్ఛ సర్వేక్షణ్ చిత్రాల్లో చోటు