మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. జిల్లా పాలనాధికారి ఎస్.వెంకట్రావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం గౌరవ వందనం స్వీకరించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా 2019లో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సేవా పథకాలను బహూకరించారు. ఈ సందర్భంగా పలువురి స్వాతంత్య్ర సమరయోధులను సన్మానించారు.
జిల్లా అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన రూ.29వేల కోట్ల నిధులలో ఇప్పటి వరకు రూ.20 వేల కోట్లు ఖర్చు చేశామని కలెక్టర్ తెలిపారు. కరోనా సమయంలో జిల్లా యంత్రాంగం ముందుండి సేవలు అందించారని కొనియాడారు. విపత్కర సమయంలోనూ సేవలకు ఎటువంటి అతరాయం కలగలేదన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి.
ఇదీ చూడండి: ఈ చిన్నారుల గణతంత్ర వేడుకలు.. ఎందరికో ఆదర్శం