మహబూబ్నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం అల్లీపూర్లో అక్రమంగా నిల్వ ఉంచిన 150 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని రెవెన్యూ, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు. వనపర్తి జిల్లా అమరచింత గ్రామానికి చెందిన కృష్ణ... ఈ బియ్యాన్ని తక్కువ ధరకు సేకరించి, అధిక ధరకు అమ్ముకోవడం వ్యాపారంగా మార్చుకున్నాడు.
కొన్ని రోజులుగా సేకరించిన 150క్వింటాళ్ల బియ్యాన్ని అల్లిపూర్ శివారులో... ముళ్ళ పొదల్లో దాచి పెట్టాడు. విశ్వసమీయ సమాచారంతో డిప్యూటీ తాహసీల్దార్ బాల ప్రసాద్ బృందంతో కలసి... దాడి చేసి బియ్యం స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి: కిడ్నాప్ కేసు: భార్గవరామ్ ఇంట్లో పథకం... 20 మంది 'గ్యాంగ్'తో అమలు