YS Sharmila Padayatra in Mahabubabad: మహబూబాబాద్ జిల్లాలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత వైఎస్ షర్మిల 239వ రోజు ప్రజాప్రస్థానం పాదయాత్ర కొనసాగుతోంది. మహబూబాబాద్ నియోజకవర్గం నెల్లికుదురు మండలంలోని కాచికల్లులో నుంచి నెల్లికుదురు క్రాస్ రోడ్డు మీదుగా నెల్లికుదురు మండల కేంద్రం వరకు యాత్ర కొనసాగుతోంది. తమతో పాటు స్థానిక నాయకలు కొందరు ఈ యాత్రలో పాల్గొన్నారు.
సాయంత్రం నాలుగు గంటలకు నెల్లికుదురు మండల కేంద్రంలో 'మాట - ముచ్చట' కార్యక్రమం జరగనుంది. దారి పొడవునా షర్మిల ప్రజలకు అభివాదం చేస్తూ పాదయాత్రను కొనసాగించారు. కార్యకర్తలు పార్టీ జెండా పట్టుకొని తమ వెంట ఉత్సాహంగా నడిచారు. యువతీ, యువకులు షర్మిలతో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. ఆమెతో పాటు ప్రజలు కూడా ఉత్సహాంగా వారి గ్రామంలో నడిచారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ప్రజాప్రస్థానం పాదయాత్రకు పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ట్రాఫిక్‌కి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు.
షర్మిల ప్రజా ప్రస్థాన పాదయాత్రను 2021 సంవత్సరంలో అక్టోబర్ 20న చేవేళ్ల నుంచి ఈ పాదయాత్రను మొదలుపెట్టారు. ఇటీవలే మంచిర్యాల జిల్లాలో 3వేల కిలోమీటర్ల మైలు రాయిని దాటారు. ఈ పాదయాత్రలో తమ పార్టీ పటిష్ఠతను మరింత చాటుతున్నారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో ఆమె పాదయాత్ర చేయడం వలన పార్టీ మనుగడ క్రమంగా అభివృద్ధి చెందుతుంది.
పాదయాత్ర చేస్తున్నందున ప్రతి జిల్లాలోని సమస్యలపై సమగ్రంగా తెలుసుకొంటున్నారు. వాటిలో కొన్నింటిపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ పోటీచేయనున్నది. దీంతో ప్రతి నియోజక వర్గంలో తమ అభ్యర్థులతో కలుస్తున్నారు. ఇప్పటికే ఈ యాత్ర వలన మంచి స్పందన వస్తుందని కొందరు వ్యక్తులు చెబుతున్నారు.
ఇవీ చదవండి: