ETV Bharat / state

Etv Bharat Effect: ఈటీవీ భారత్​ కథనానికి స్పందన.. బాధిత కుటుంబానికి చేయూత

author img

By

Published : Dec 25, 2021, 7:45 PM IST

Etv Bharat Effect: అంధత్వం, నడవలేక, నిలబడలేక వింత వ్యాధితో బాధపడుతున్న ఇద్దరు పిల్లల దీనగాథకు తానా ఫౌండేషన్​ స్పందించింది. మహమ్మారితో నరకయాతనను అనుభవిస్తున్న పిల్లలు, వారిని సాకేందుకు తల్లిదండ్రులు ఎదుర్కొంటున్న దుస్థితిపై ఈటీవీ భారత్​లో వచ్చిన కథనానికి తానా ఫౌండేషన్‌ ప్రతినిధులు స్పందించారు. బాధిత కుటుంబానికి చేయూతనందించి భరోసా కల్పించారు.

Etv Bharat Effect: ఈటీవీ భారత్​ కథనానికి స్పందన.. బాధిత కుటుంబానికి చేయూత
Etv Bharat Effect: ఈటీవీ భారత్​ కథనానికి స్పందన.. బాధిత కుటుంబానికి చేయూత

Etv Bharat Effect: కాయకష్టం చేసుకునే ఆ దంపతులకు పుట్టిన ఇద్దరు మగపిల్లలు వారు. బాగా చదివించి ప్రయోజకులను చేస్తే తమ ఇబ్బందులు తీరుస్తారనే ఆశతో పోషించుకుంటున్నారు. బిడ్డలు ఎదుగుతున్న దశలో అరుదైన వ్యాధి ఒకరి తరువాత ఒకరిని కోలుకోలేకుండా దెబ్బతీసింది. ఫలితంగా ఇప్పుడు వారిద్దరూ చూడలేరు.. మాట్లాడలేరు.. నడవలేరు.. కూర్చోలేరు.. అన్నం పెట్టమని అడగలేరు. పేద కుటుంబంపై రాకాసిలా విరుచుకుపడిన మహమ్మారితో ఆ కుటుంబ పరిస్థితి దయనీయంగా మారింది. వారి దీనస్థితిపై ఈటీవీ భారత్​ కథనాన్ని ప్రచురించగా.. స్పందన లభించింది. బాధిత కుటుంబానికి చేయూతను అందిస్తామంటూ తానా ఫౌండేషన్​ ముందుకొచ్చింది.

అరుదైన వ్యాధితో నరకయాతన

మహబూబాబాద్‌ జిల్లా కురవి మండలం నేరడకు చెందిన ఇటిక వెంకన్న-సంధ్య దంపతులకు ఇద్దరు కుమారులు చరణ్‌, శరత్‌. వీరు అరుదైన వ్యాధితో చూపు కోల్పోయి, నడవలేక, నిలబడలేక, మాట్లాడలేక నరకయాతనను అనుభవిస్తున్న తీరుపై గతంలో ఈటీవీ భారత్​లో వచ్చిన కథనానికి తానా ఫౌండేషన్‌ ప్రతినిధులు స్పందించారు. బాధిత కుటుంబాన్ని ఫౌండేషన్‌ ప్రతినిధులు సంప్రదించి... బాలుర సమస్యలు, వారి కుటుంబం ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.

పిండి మిల్లు అందజేత

ఆ నిరుపేద కుటుంబానికి ఫౌండేషన్‌ ద్వారా రూ.60 వేల విలువ గల పిండి మరను అందజేశారు. కారం, పిండి మిల్లును వారికి అందజేసి ప్రారంభించారు. తమకు అండగా నిలిచిన ఈనాడు, ఈటీవీ భారత్​లకు బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

అనంతరం ఫౌండేషన్​ ప్రతినిధులు ప్రభుత్వ పాఠశాలకు 40 బల్లాలు, 30 మంది పేదలకు దుప్పట్లు, 100 మంది పదో తరగతి విద్యార్థులకు సోలార్‌ దీపాలను పంపిణీ చేశారు.

సంబంధిత కథనం:

అయ్యో బిడ్డలారా.. ఎంత కష్టం! చూడలేరు.. నడవలేరు.. మాట్లాడలేరు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.