కరోనా బాధితులంటే కనీస మానవత్వం చూపించని కాలంలో.. వైరస్‌తో మృతి చెందిన ఓ వృద్ధురాలికి ఇద్దరు మహిళలు ధైర్యంగా ముందుకొచ్చి అంత్యక్రియలు జరిపారు. పంచాయతీ కార్యదర్శి.. మృతురాలి కోడలితో కలిసి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలో ఇది జరిగింది.
చర్లపల్లి గ్రామానికి చెందిన కల్తీ బుచ్చమ్మ (75) అనే వృద్ధురాలు కొవిడ్ బారిన పడి మృతి చెందింది. లారీ నడిపే ఆమె కుమారుడు.. ఇంటికి తిరిగి ఎప్పుడు వస్తాడో తెలియని పరిస్థితి. బంధుమిత్రులు, గ్రామస్థులు ఎవరూ కనీసం చూసేందుకు
కూడా ముందుకు రాకపోవడంతో.. కోడలు దిక్కు తోచని స్థితిలో పడిపోయింది.
విషయం తెలుసుకున్న పంచాయతీ సెక్రటరీ శిరీష.. ధైర్యంగా ముందుకు వచ్చారు. మృతురాలి కోడలితో కలిసి.. పీపీఈ కిట్లు ధరించి మృతదేహాన్ని ఖననం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు.
ఇదీ చదవండి: మహమ్మారి భయంతో బాల్యవివాహాలు.. బలవుతున్న చిన్నారులు