Vande Bharat Train: సికింద్రాబాద్-విశాఖపట్నం వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుపై మరోసారి రాళ్ల దాడి జరిగింది. మహబూబాబాద్-గార్ల రైల్వే స్టేషన్ల మధ్య గుర్తు తెలియని వ్యక్తి రాయి విసరడంతో ఒక బోగి అద్దాలు ధ్వంసమయ్యాయి. సమాచారం అందుకున్న రైల్వే రక్షక దళం అప్రమత్తమైంది. నిందితుడిని గుర్తించేందుకు దర్యాప్తు చేపట్టారు. రైలు సికింద్రాబాద్ నుంచి విశాఖ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. భారత్ రైలు సీ-8 కోచ్‌లో సీటు నంబర్ 41, 42, 43 వద్ద ఉన్న అద్దం పగిలిందని, ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదని రైల్వే అధికారులు తెలిపారు.
గతంలో వందే భారత్ రైలు ప్రారంభానికి ముందు ఆకతాయిలు రాళ్లు విసిరిన ఘటన విశాఖలో జరిగింది. నిర్వహణ పర్యవేక్షణలో భాగంగా విశాఖ స్టేషన్ నుంచి కోచ్ కాంప్లెక్స్‌కు ట్రైన్ వెళ్తుండగా.. కంచరపాలెం రామ్మూర్తిపంతులు పేట వద్దకు రాగానే కొందరు ఆకతాయిలు రైలుపై రాళ్లు విసిరారు. ఈ ఘటనలో వందే భారత్ రైలు కిటికీ అద్దం ధ్వంసమైంది.
ఇవీ చదవండి: 'పచ్చని మాగాణిగా ఉన్న తెలంగాణను పిచ్చోళ్ల చేతిలో పెట్టొద్దు'
నా ఆస్తులు, కేటీఆర్ ఆస్తులపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి: రేవంత్‌రెడ్డి
ఎంపీ రజనీపై సస్పెన్షన్ వేటు.. ట్విట్టర్లో ఆ వీడియో పెట్టడమే కారణం