Twins Veena Vani 20th Birthday : వీణ-వాణీలు.. వీరు అవిభక్త కవలలు. ప్రపంచ వ్యాప్తంగా వీరు తెలియని వారుండరు. పుట్టుకతోనే తలలు అతుక్కుని జన్మించిన వీరు నూతన సాంకేతిక వైద్యరంగానికే సవాలుగా నిలిచి విడదీయరాని బంధంగా నిలిచారు. సోమవారం ఈ అవిభక్త కవలలు 20 వసంతాలు పూర్తి చేసుకుని 21వ వసంతంలోకి అడుగు పెట్టనున్నారు. హైదరాబాద్‌లోని శిశు విహార్‌లోనే వీరు ఏటా తమ పుట్టని రోజును జరుపుకుంటుంటారు. 20 ఏళ్లుగా వీరు శిశు విహార్‌లోనే ఉంటున్నారు.
శరీరాలు అతుక్కొని పుట్టినా.. ప్రభుత్వ ఉద్యోగం కొట్టారు!
మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం బీరిశెట్టిగూడెం గ్రామానికి చెందిన అవిభక్త కవలలు వీణ-వాణీలు మారగాని మురళీ-నాగలక్ష్మి దంపతులకు 2003 అక్టోబర్ 16న సూర్యాపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వీరు జన్మించారు. జన్మతహా వీరు రెండు తలలు అతుక్కుని జన్మించారు.
Twins Veena Vani Birthday : వీరికి గుంటూరుకు చెందిన నాయుడమ్మ వైద్య చికిత్స అందించారు. అనంతరం నీలోఫర్ ఆసుపత్రిలో చేర్పించగా వారు అక్కడే ఉంటున్నారు. వీరికి శస్త్రచికిత్స చేసేందుకు అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, లండన్ వంటి దేశానికి చెందిన వైద్యులు వచ్చి అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ప్రభుత్వం నుంచి అనుమతి లేకపోవడంతో వీరు ఆపరేషన్ అలాగే ఏళ్ల తరబడి నిలిచిపోయిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. దీంతో వారిని ప్రస్తుతం స్టేట్‌హోంలో ఉంచారు. ప్రస్తుతం వీరు డిగ్రీ (సీఏ) రెండో సంవత్సర విద్యను అభ్యసిస్తున్నారు. వీరికి అన్ని రకాల సేవలు, ఆలనాపాలనా అక్కడి వారే చూస్తున్నారు.
పెళ్లి దుస్తులతో ఓటేసేందుకు వధువు.. అధికారుల సాయంతో అవిభక్త కవలలు
ఈ ఏడాది వీణ వాణీలు తమ సొంతూరుకు వచ్చి కుటుంబ సభ్యులతో గడిపి వెళ్లారు. తమ పిల్లలకు ఆపరేషన్ చేయాలని అన్ని ప్రభుత్వాలను, ముఖ్యమంత్రులను కలిసి వేడుకున్నా ఫలితం లేకుండా పోయిందని వారి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం తమ పిల్లలతో కలిసి ఉండేందుకైనా ప్రభుత్వం ఉపాధి అవకాశం కల్పించాలని విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదని తల్లిదండ్రులు విచారం వ్యక్తం చేస్తున్నారు.
గతంలో పిల్లలతో తాము కలిసి ఉండేలా చూస్తామని హామీ ఇచ్చినా ఆ హామీ నేటికి కార్యరూపం దాల్చలేదని వాపోతున్నారు వారి తల్లిదండ్రులు. పిల్లలతో కలిసి ఉండేలా తమకు ప్రభుత్వం ఉపాధిని కల్పించాలని వారి తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. కన్నవారు.. తోబుట్టువుల మధ్య జీవించలేకపోతున్నారీ పిల్లలు. ప్రతి సంవత్సరం శిశువిహార్‌లోజరిగే వీణవాణీల జన్మదిన వేడుకలకు బీరిశెట్టి గూడెం నుంచి వారి తల్లితండ్రులు, కుటుంబ సభ్యులు వెళ్తుంటారు.
Twins story: కవలలుగా పుట్టారు.. ఒకే కాన్పులో ఏడుగురికి జన్మనిచ్చారు.!