మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని రామచంద్రాపురం పంచాయతీ సింగారానికి చెందిన గర్భిణి బొర్ర కుమారి ప్రసవ వేదనతో బాధపడుతుండగా... 108 వాహనంలో ప్రభుత్వాస్పత్రికి తరలించేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నించారు. ఆస్పత్రికి తరలిస్తుండగా... వాహనంలోనే కుమారి కవలలకు జన్మనిచ్చింది. వెంటనే ఈఎంటీ నరేశ్ వైద్యం అందించారు. తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నట్లు తెలిపారు.
ఇవీ చూడండి: బాబాయి, అబ్బాయితో మొదలై... ఇలా విజృంభిస్తోంది