ETV Bharat / state

ఏడు చోట్లా తెరాస మద్దతుదారులకే పదవులు

author img

By

Published : Feb 16, 2020, 8:00 PM IST

మహబూబాబాద్​ జిల్లా డోర్నకల్​ నియోజకవర్గంలోని ఏడు పీఏసీఎస్​ ఛైర్మన్​, వైస్​ ఛైర్మన్​ల ఎన్నికల్లో తెరాస మద్దతుదారులే సత్తా చాటారు.

narsimhulupet pacs
ఏడు చోట్లా తెరాస మద్దతుదారులకే పదవులు

మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గంలోని ఏడు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఛైర్మన్​, వైస్​ ఛైర్మన్​ ఎన్నిక ఇవాళ జరిగింది. అన్ని చోట్లా తెరాస మద్దతుదారులే పదవులు చేపట్టారు.

నరసింహులపేట పీఏసీఎస్​ ఛైర్మన్​గా సంపేట రాము, వైస్​ఛైర్మన్​గా సంజీవరెడ్డి ఎన్నికయ్యారు. మరిపెడ సహకార సంఘానికి ఛైర్మన్​గా యాదగిరిరెడ్డి, వైస్​ఛైర్మన్​గా మహేశ్​ ఎన్నికయ్యారు.

కురవి వ్యవసాయ సహకార పరపతి సంఘం ఛైర్మన్​, వైస్​ ఛైర్మన్​లుగా గోవర్ధన్​రెడ్డి, వీరన్న ఎన్నికయ్యారు. కాంపల్లి సొసైటీ ఛైర్మన్​, వైస్​ఛైర్మన్​లుగా శ్రీదేవి, శ్రీను.. గుండ్రాతిమడుగు ఛైర్మన్​గా వెంకట్​రెడ్డి, వైస్​ చైర్మన్​గా దీపక్​ ఎన్నికయ్యారు.

డోర్నకల్ పీఏసీఎస్​ ఛైర్మన్​గా భిక్షం రెడ్డి, వైస్​ఛైర్మన్​గా వెంకన్న ఎన్నికయ్యారు. మన్నెగూడెం సహకార సంఘం ఛైర్మన్​గా సీతారాం రెడ్డి, వైస్​ఛైర్మన్​గా మన్మధరావు ఎన్నికయ్యారు. వీరితో ఎన్నికల అధికారులు ప్రమాణ స్వీకారం చేయించారు. నూతనంగా ఎన్నికైన వారిని స్థానిక ప్రజాప్రతినిధులు సన్మానించారు.

ఏడు చోట్లా తెరాస మద్దతుదారులకే పదవులు

ఇవీచూడండి : హాలియా సహకార పోలింగ్​లో రైతుపై చేయిచేసుకున్న ఎస్సై

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.