ETV Bharat / state

'కేజీ టూ పీజీ ఉచిత విద్యకు ప్రభుత్వం కృషి చేస్తోంది' - పంచాయతీరాజ్​ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు

కేసీఆర్​ మానసపుత్రిక అయిన కేజీ టూ పీజీ ఉచిత విద్యను అందించేందుకు తెరాస ప్రభుత్వం కృషి చేస్తోందని గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్​ అన్నారు.

tribal welfare minister satyavathi rathode says telangana government is trying hard to implement kg to pg free education
తెలంగాణలో కేజీ టూ పీజీ ఉచిత విద్య
author img

By

Published : Dec 3, 2019, 10:19 AM IST

తెలంగాణలో కేజీ టూ పీజీ ఉచిత విద్య

స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి తెరాస అధికారంలోకి వచ్చే వరకు రాష్ట్రంలో గిరిజనులకు 50 గురుకుల పాఠశాలలుండేవని గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్​ అన్నారు. ఐదేళ్ల కేసీఆర్​ పాలనలో 53 నూతన గురుకులాలు ప్రారంభించామని తెలిపారు.

మహబూబాబాద్​లో గిరిజన బాలుర రెసిడెన్షియల్​ పాఠశాల భవనాన్ని పంచాయతీరాజ్​ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావుతో కలిసి ఆమె ప్రారంభించారు. అనంతరం గ్రామ పంచాయతీలకు 40 ట్రాక్టర్లను పంపిణీ చేశారు.

గ్రామ సర్పంచ్​లు ట్రాక్టర్లను తమ సొంత పనులకు ఉపయోగించొద్దని మంత్రి ఎర్రబెల్లి స్పష్టం చేశారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచేందుకు కృషి చేయాలని సూచించారు.

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.