రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుందని... ఉద్యోగులకు పీఆర్సీ, నియామకాలు, నిరుద్యోగ భృతి ఇచ్చే పరిస్థితుల్లో లేదని తెజస అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఉదయనడకకు వచ్చిన వారితో కలిసి వ్యాయామం చేస్తూ... ఖమ్మం- వరంగల్-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను అమలు జరిపేలా కేంద్రంపై ఒత్తిడి తేవడం లేదని ఆరోపించారు. వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికల్లో... దుబ్బాక ఫలితం పునరావృతం అవుతుందన్నారు. పట్టభద్రుల ఎన్నికల్లో ప్రశ్నించే వారిని పెద్దల సభకు పంపాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు డోలి సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి పిల్లి సుధాకర్, స్థానికులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: 'రియల్ ఎస్టేట్ రంగాన్ని ప్రభుత్వం కుదేలు చేసింది'