ETV Bharat / state

కరోనా కల్లోలం.. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి

కరోనా ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. తండ్రి మృతి చెందిన రెండవ రోజే పెద్ద కుమారుడు... వారి దశ దిన కర్మలు పూర్తి కాక ముందే చిన్న కుమారుడు మృతి చెందారు. దీంతో కుటుంబంలో పెద్దదిక్కులను కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఈ విషాద ఘటన మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండల కేంద్రంలో చోటుచేసుకుంది.

Three members dead with Corona
కరోనాతో ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి
author img

By

Published : May 12, 2021, 8:25 AM IST

పది రోజుల వ్యవధిలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని కొవిడ్‌ మహమ్మారి కబళించిన విషాద ఘటన ఇది. మహబూబాబాద్‌ జిల్లా నెల్లికుదురుకు చెందిన భిక్షం(60)కు ముగ్గురు కుమారులు. పెద్ద కుమారుడు వీరన్న(40) నెల్లికుదురు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో సెరికల్చర్‌ ల్యాబ్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తూ మహబూబాబాద్‌ పట్టణంలో ఉంటున్నారు. రెండో కుమారుడు రామచంద్రు హైదరాబాద్‌లో, మూడో కుమారుడు ఉపేందర్‌(32) హన్మకొండలో నివాసముంటున్నారు.

భిక్షం దంపతులకు ఇటీవల ఆరోగ్యం సహకరించకపోవడంతో వీరన్న వద్ద కొన్ని రోజులు ఉందామని వెళ్లారు. అక్కడికి వెళ్లిన కొద్ది రోజులకే వీరన్న కొవిడ్‌ బారిన పడటంతో గూడూరులోని క్వారంటైన్‌ కేంద్రంలో చేరి చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే భిక్షంకు సైతం వైరస్‌ సోకి అస్వస్థతకు గురి కావడంతో హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రికి తరలించారు. వీరన్నను కూడా అక్కడికే తరలించారు. చికిత్స పొందుతూ ఈ నెల రెండో తేదీన భిక్షం, 4న వీరన్న మృతి చెందారు.

ఈ విషాదం నుంచి కుటుంబం కోలుకోకముందే మూడో కుమారుడు ఉపేందర్‌ కరోనా బారిన పడి హన్మకొండలో చికిత్సకు యత్నించినా పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌కు తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ ఉపేందర్‌ మంగళవారం మృతి చెందారు. పది రోజుల వ్యవధిలో ఒకే కుటుంబానికి ముగ్గురు వ్యక్తులు మరణించడంతో మండల కేంద్రంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ఇదీ చదవండి: రాష్ట్రంలో లాక్​డౌన్ 2.0... తాజా నిబంధనలు​ ఇవే..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.