మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ పోలీస్ స్టేషన్ ఎస్సై నగేష్ కరోనా నుంచి కోలుకొని తిరిగి విధుల్లో చేరారు. కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వెంటనే హోం క్వారంటైన్లోకి వెళ్లిపోయిన ఎస్సై నగేష్ తగిన జాగ్రత్తలు, వైద్యుల సలహాలు పాటిస్తూ.. వైరస్ బారి నుంచి కోలుకున్నారు. కరోనా నుంచి కోలుకొని విధుల్లో చేరిన ఎస్సై నగేష్‌ను జిల్లా ఎస్పీ కోటిరెడ్డి పుష్ఫగుచ్ఛం అందించి అభినందించారు. తనకు కరోనా పాజిటివ్ అని తెలిసినప్పటి నుంచి జిల్లా ఎస్పీ ప్రతిరోజు ఫోన్లో మాట్లాడి తనలో ధైర్యం నింపారని ఎస్సై తెలిపారు.
ఇదీ చూడండి: కొత్త విద్యా విధానం... కొన్ని సవాళ్లు!