రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని డోర్నకల్ శాసన సభ్యుడు డీఎస్ రెడ్యానాయక్ కోరారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం గొల్లచర్ల, బంజర, ఉయ్యాలవాడ, మన్నెగూడెం గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఆధ్వర్యంలో వీటిని నిర్వహించనున్నారు.
రైతులు పండించిన పంటకు మద్ధతు ధర కల్పించేందుకే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. గ్రామాల్లో తక్కువ ధరకు విక్రయించి నష్టపోవద్దన్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించి లబ్ధిపొందాలని సూచించారు.
ఇవీచూడండి: నేడు పేదల బ్యాంకు ఖాతాల్లో జమకానున్న రూ.1500