ఆర్టీసీ కార్మికులు 20 రోజులుగా సమ్మె చేస్తున్నా ముఖ్యమంత్రి వైఖరిలో ఎలాంటి మార్పు రాలేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపో ఎదుట సమ్మె చేస్తున్న కార్మికుల దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. హైకోర్టు ఆదేశించినా.. ఆర్టీసీ కార్మికులను చర్చలకు పిలువకుండా కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారన్నారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. హుజూర్‌నగర్‌లో వచ్చిన ఫలితాన్ని వక్రీకరించి మైండ్ గేమ్ ఆడటానికి అధికార పార్టీ నాయకులు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఈ నెల 19న జరిగిన సంపూర్ణ బంద్‌తో ప్రజలు ఆర్టీసీ కార్మికులకు మద్దతు తెలిపారని.. అక్టోబర్ 30న జరిగే సకల జనుల సమరభేరికి సైతం మద్దతు ఉంటుందని తమ్మినేని వీరభద్రం ధీమా వ్యక్తం చేశారు.
ఇవీచూడండి: హరీశ్‌రావు.. ఆర్టీసీ కార్మికుల కష్టాలు కనిపించడం లేదా..!: మందకృష్ణ