రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలంటూ మహబూబాబాద్ జిల్లాకేంద్రంలో ఉపాధ్యాయులు ర్యాలీ చేపట్టారు. పట్టణంలోని వివేకానందసెంటర్ నుంచి మదర్‌థెరిసా సెంటర్ వరకు టీపీటీఎఫ్ ఆధ్వర్యంలో నినాదాలు చేస్తూ నిరసన తెలియజేశారు. అన్నదాతలు పండించిన పంటలపై ఎందుకు ఆంక్షలు విధిస్తున్నారని ప్రశ్నించారు.
పంటలకు గిట్టుబాటు ధర కల్పించి, వ్యవసాయ నూతన చట్టాలను రద్దు చేయాలంటూ టీపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి మైస శ్రీనివాస్ డిమాండ్ చేశారు. వ్యవసాయాన్ని కార్పొరేట్లకు అప్పగిస్తే భూమిని పీల్చి పిప్పి చేస్తారని, సారవంతం కోల్పోయి ఎందుకు పనిరాకుండా పోతుందని అన్నారు. దిల్లీలో ధర్నా చేస్తున్న రైతులకు ప్రతి ఒక్కరు సంఘీభావం తెలపాలని ఆయన కోరారు.