కొవిడ్ కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని తెదేపా నేతలు ఆరోపించారు. కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని... మృతుల కుటుంబాలకు పదిలక్షల రూపాయల చొప్పున పరిహారం చెల్లించాలని మహబూబాబాద్ నియోజకవర్గ పార్లమెంట్ తెదేపా ఇంఛార్జి కొండపల్లి రామచందర్రావు అన్నారు.
అంతేకాకుండా కొవిడ్ బారిన పడి మృతిచెందిన పోలీసులు, జర్నలిస్టులు, డాక్టర్లు, పారిశుద్ధ్య కార్మికులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరో 50 లక్షల రూపాయలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కొవిడ్ రోగుల కోసం ఆస్పత్రుల సంఖ్యను పెంచాలన్నారు. పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్ కార్యాలయంలో అందజేశారు.