ETV Bharat / state

'లంచం ఇవ్వలేదని సర్పంచ్​నే కొట్టిన ఖాకీ' - mahabubabad district news today

లంచం ఇవ్వనందుకే తనపై పెద్ద వంగర ఎస్సై దాడి చేశాడని ఓ సర్పంచ్ భర్త ఆరోపించారు. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా పెద్ద వంగర మండలం ఉప్పరగూడెంలో జరిగింది.

si attack Sarpanch at mahabubabad district
'లంచం ఇవ్వలేదని సర్పంచ్​నే కొట్టిన ఖాకీ'
author img

By

Published : Jan 29, 2020, 6:54 PM IST

మహబూబాబాద్ జిల్లా పెద్ద వంగర మండలం ఉప్పరగూడెం సర్పంచ్ భర్తను పెద్ద వంగర ఎస్సై బాణోత్ రామ్ చరణ్ చితకబాదాడు. లంచం ఇవ్వనందుకే తనపై దాడి చేశాడని తెరాసకు చెందిన సర్పంచ్ భర్త సమ్మయ్య ఆరోపించారు. తీవ్ర గాయాలయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

'లంచం ఇవ్వలేదని సర్పంచ్​నే కొట్టిన ఖాకీ'

గ్రామానికి చెందిన ఓ పంచాయతీ విషయంలో పోలీస్​స్టేషన్​కు వెళ్లిన సర్పంచ్​ను నువ్వెందుకు వచ్చావని ఎస్సై రామ్​చరణ్ చితకబాదాడు. ఎస్సై రామ్ చరణ్​కు లంచం ఇవ్వలేదనే తనపై దాడి చేశాడని సమ్మయ్య ఆరోపించారు. తనను పలుమార్లు లంచం ఆడిగేవాడని, పెద్ద వంగర పోలీస్​స్టేషన్​లో లంచంగా డబ్బులిస్తేనే పని అవుతుందని బాధితుడు సమ్మయ్య తెలిపాడు.

ఇదీ చూడండి : 'వారి బంధాన్ని చావు కూడా విడదీయలేకపోయింది'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.