మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం రావిగూడెం రైతులు సీతారామ ప్రాజెక్టు కింద భూములు కోల్పోతున్నారు. వారికి న్యాయం చేయాలంటూ మహబూబాబాద్ కలెక్టరేట్ ఎదుట రైతులు ధర్నాకు దిగారు. తమ భూముల్లో సర్వే చేయొద్దని.. వాటిని బలవంతంగా లాక్కోవద్దని, తమకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. అనంతరం తమ సమస్య పరిష్కరించాలంటూ కలెక్టర్కు వినతిపత్రాన్ని సమర్పించారు.
అందనాలపాడు గ్రామంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాలకు చెందిన రైతులే ఉన్నారని.. తమకు కేటాయించిన భూముల్లో వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నామని.. తమ భూములను బలవంతంగా లాక్కోవద్దని రైతులు విజ్ఞప్తి చేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో తీసుకుంటే ఎకరానికి రూ. 50 లక్షల నష్టపరిహారం చెల్లించి, కుటుంబానికో ఉద్యోగమివ్వాలని వారు డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి: కరోనాతో ఆర్టీసీకి తగ్గిన ఆదాయం.. పార్శిల్పైనే ఆశలు