మహార్షి పాఠశాలకు చెందిన బస్సు సుమారు 35 మంది విద్యార్థులతో మహబూబాబాద్ నుంచి కంబాలపల్లి వైపుకు వెళ్తుండగా, గేదెలను తప్పించబోయి బోలెరో వాహనంను ఢీకొట్టింది. క్యాబిన్లో ఇరుక్కున్న బస్ డ్రైవర్ను స్థానికులు బయటకు తీశారు. తీవ్రంగా గాయపడ్డ నలుగురు క్షతగాత్రులను మహబూబాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
స్వల్పంగా గాయపడిన 10 మంది విద్యార్థులను ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.
ఇవీ చూడండి: ఎద్దును తప్పించబోయి ప్రమాదం.. 12 మంది దుర్మరణం