మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో స్వర్గీయ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి వేడుకలు నిర్వహించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఉపాధ్యాయులతో కలిసి ఎమ్మెల్యే శంకర్ నాయక్ సర్వేపల్లి చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.
ఉపాధ్యాయునిగా జీవితం ప్రారంభించి.. భారత ఉపరాష్ట్రపతిగా సేవలందించి భారతరత్న అవార్డును అందుకున్న మహనీయుడు సర్వేపల్లి అని కొనియాడారు. విద్యార్థులను భావిభారత పౌరులుగా తీర్చిదిద్ది, సమాజ అభ్యున్నతిలో ప్రధాన పాత్ర పోషిస్తున్న ఉపాధ్యాయులందరికి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
- ఇదీ చూడండి: రాజ్యసభ 'పెద్ద'లకు కరోనా భయం!