సాదాబైనామాల క్రమబద్ధీకరణకు దరఖాస్తు గడువు నేటితో ముగియడంతో ప్రజలు నిరాశతో వెనుదిరిగారు. మహబూబాబాద్ జిల్లావ్యాప్తంగా ఉదయం నుంచే మీసేవల వద్ద ప్రజలు పెద్దఎత్తున బారులు తీరారు. సర్వర్ మొరాయించడంతో చాలామంది దరఖాస్తు చేయకుండానే వెనుదిరగాల్సి వచ్చింది.
వారం రోజులుగా మీసేవల చుట్టూ తిరుగుతున్న రద్దీగా ఉండడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉదయం నుంచి క్యూలైన్లలో వేచి ఉన్నా దరఖాస్తు చేసుకోలేదని వాపోయారు. దయచేసి ప్రభుత్వం మరోసారి గడువు పొడిగించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.