మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ స్థలాల్లో (సర్వే నంబర్ 287, 551) నిర్మిస్తున్న అక్రమ కట్టడాలను రెవెన్యూ, మున్సిపల్ అధికారులు పోలీసుల సహకారంతో కూల్చివేశారు.
ప్రభుత్వ భూముల్లో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించిన కట్టడాలను కూల్చివేయాలన్న కలెక్టర్ ఆదేశాలతో చర్యలు తీసుకున్నామని మున్సిపల్ కమిషనర్ ఇంద్రసేనా రెడ్డి తెలిపారు. నూతన చట్టం ప్రకారం ప్రతి ఒక్కరు మున్సిపాలిటీలో అనుమతులు తీసుకుని నిర్మాణాలు చేసుకోవాలని, లేని పక్షంలో కూల్చి వేస్తామని హెచ్చరించారు.
ప్రభుత్వ యంత్రాంగం కొవిడ్ విధుల్లో మునిగి పోయిన సమయంలో... ఇదే అదనుగా భావించి కొంతమంది అక్రమ నిర్మాణాలు చేపట్టారని తహసీల్దార్ రంజిత్ కుమార్ అన్నారు.